Watch Video: నాడు గొంతులో 22 కత్తులను దింపి గిన్నీస్‌ రికార్డు.. నేడు పిడికెడు పొట్టకోసం అగచాట్లు!

| Edited By: Srilakshmi C

Jan 09, 2025 | 8:24 AM

కొన్నేళ్ల క్రితం ప్రపంచంలో ఏ వీరుడు చేయలేని అరుదైన సాహసం చేశాడు మన తెలంగాణ బిడ్డ. గొంతులో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 22 కత్తులు దింపి ప్రపంచాన్ని అబ్బురపరిచాడు. దెబ్బకు గిన్నీస్ రికార్డు కూడా అతని పేరిట నమోదైంది. కానీ నేడు ఈ గిన్నీస్ వీరుడి పరిస్థితి కడుదీనంగా మారింది. జానెడు పొట్టకోసం అగచాట్లు పడుతున్నాడు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాడు..

Watch Video: నాడు గొంతులో 22 కత్తులను దింపి గిన్నీస్‌ రికార్డు.. నేడు పిడికెడు పొట్టకోసం అగచాట్లు!
Guinness World Record Winner Kishan
Follow us on

పెద్దపల్లి, జనవరి 8: ఇతడు ప్రపంచంలో ఎవరూ చేయలేని సాహసం చేసి ప్రపంచ రికార్డు సాధించాడు. నోట్లో ఏకంగా 22 కత్తులు పెట్టుకొని గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. నోట్లో 22 కత్తులు పెట్టుకొని రికార్డు సాధించి అందరినీ అబ్బురపరిచాడు. అలాంటి సాహాసికి ఇప్పుడు రెండు పూటల తిండి దొరకడం లేదు. కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. తనను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వలకు చెందిన ఆవుల కిషన్ 30 యేళ్లుగా సాహస విన్యాసాలు చేస్తున్నాడు. ముంబాయ్, డిల్లీ లాంటి ప్రాంతాల్లో కూడా ప్రదర్శనలు చేశాడు. అయితే గత రెండేళ్లుగా స్టేజీ షోలు తగ్గాయి. దీంతో స్వగ్రామానికి చేరుకొని కూలీ పనులు చేస్తున్నాడు. ఈయనకు ఐదుగురు కూతుర్లు. ప్రపంచ రికార్డు సాధించినప్పటికీ తనకు కడుపు నిండ అన్నం దొరకడం లేదని ఆవేదన చెందుతున్నాడు. దుబాయ్ లాంటి దేశాల్లోనూ అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు.

ఇవి కూడా చదవండి

నోట్లో అవలీలగా 22 కత్తులు పెట్టుకుంటాడు. కత్తులు నోట్లో పెట్టుకొని మళ్లీ చేతులతోనూ విన్యాసాం చేస్తాడు.. ఈ విధంగా కత్తులు నోట్లో పెట్టుకొని సాహసం చేయడం చాలా అరుదు. దేశంలో కిషన్ మాత్రమే ఇలాంటి సాహస న్యాసాలు చేస్తున్నాడు. దీని ఎంతో సాధన ఉంది. ఈ కత్తులు కూడా రెండు ఫీట్ల వరకు ఉంటాయి. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలకు గ్యారెంటీ ఉండదు. అయినప్పటికీ ఏదో ఒక్కటి సాధించాలనే తపనతో ఇలాంటి విన్యాసాలు చేస్తున్నాడు. ఇప్పుడు కిషన్‌కు ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. రోడ్డు ప్రమాదంలో కాలుకు దెబ్బతగిలింది. అయినప్పటికీ అతి కష్టం మీద ఈ సాహసం చేస్తునే ఉన్నాడు. ఎక్కడైనే స్టేజీ షోలు లభిస్తే ఉపాధి పొందుతానని అంటున్నారు కిషన్. మొత్తానికి ఎన్నో రికార్డులు సాధించి దేశ పేరును చాటి చెప్పిన ఈయనకు మాత్రం కడుపు నిండ తిండి దొరకడం లేదు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.