CRPF భారీ రిక్రూట్‌మెంట్: 9195 పోస్టులు.. ఎలా అప్లై చేయాలో చూడండి!

CRPF Recruitment 2026: నిరుద్యోగులకు మంచి అవకాశం. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి లేదా ఐటీఐ అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. పోస్టుల సంఖ్య, పరీక్ష విధానం, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ నోటిఫికేషన్‌లో పొందుపరిచారు.

CRPF భారీ రిక్రూట్‌మెంట్: 9195 పోస్టులు.. ఎలా అప్లై చేయాలో చూడండి!
Crpf Recruitment 2026

Updated on: Apr 27, 2026 | 2:40 PM

CRPF Recruitment 2026: కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 2026 సంవత్సరానికి సంబంధించిన కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 10వ తరగతి లేదా ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్షతో పాటు ఫిజికల్ టెస్టులు కూడా ఉంటాయి. ఎంపికైన వారికి ప్రారంభం నుంచే ఆకర్షణీయమైన జీతం లభిస్తుంది.

ఖాళీలు వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్‌మెన్, పయనీర్) విభాగాల్లో మొత్తం 9175 పోస్టులు భర్తీ చేయనున్నారు.

  • ఆంధ్రప్రదేశ్‌కు సుమారు 504 పోస్టులు
  • తెలంగాణకు సుమారు 353 పోస్టులు కేటాయించారు
  • మహిళల కోసం దేశవ్యాప్తంగా 79 పోస్టులు ఉన్నాయి (ఏపీకి 3, తెలంగాణకు 3)
  • పయనీర్ విభాగంలో కొన్ని పోస్టులు అన్ని రాష్ట్రాల అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయి.

జీతం వివరాలు

ఎంపికైన వారికి లెవెల్-3 కింద ప్రారంభ మూల వేతనం రూ.21,700 ఉంటుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ వంటి అదనపు భత్యాలతో కలిపి నెలకు సుమారు రూ.40,000 వరకు జీతం వచ్చే అవకాశం ఉంటుంది. అనుభవంతో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం కూడా ఉంటుంది.

ఎంపిక విధానం

ఎంపిక ప్రక్రియ దశలవారీగా ఉంటుంది:

  • ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET)
  • ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST)
  • కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష
  • ట్రేడ్/స్కిల్ టెస్ట్ (అవసరమైతే)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ పరీక్ష
  • ఫిజికల్ టెస్టులు వివరాలు
  • PET (శారీరక సామర్థ్య పరీక్ష)
  • పురుషులు: 5 కిలోమీటర్లు 24 నిమిషాల్లో పూర్తి చేయాలి (లేదా పోస్టు ప్రకారం ఇతర ప్రమాణాలు)
  • మహిళలు: 1.6 కిలోమీటర్లు నిర్ణీత సమయ పరిమితిలో పూర్తి చేయాలి

PST (శారీరక ప్రమాణాలు)

  • పురుషుల ఎత్తు: 170 సెం.మీ
  • మహిళల ఎత్తు: 157 సెం.మీ
  • ఎస్టీ అభ్యర్థులకు కొంత సడలింపు ఉంటుంది
  • ఛాతీ విస్తీర్ణం పురుషులకు కనీసం 80 సెం.మీ (ఎస్టీలకు 76 సెం.మీ) ఉండాలి
  • శరీర నిర్మాణం, బరువు కూడా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి

రాత పరీక్ష విధానం

  • ఆన్‌లైన్ పరీక్ష
  • మొత్తం 100 ప్రశ్నలు – 100 మార్కులు
  • సమయం: 2 గంటలు
  • ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోత ఉంటుంది
  • ప్రశ్నలు 10వ తరగతి స్థాయిలో ఉంటాయి
  • భాషలు: హిందీ, ఇంగ్లీష్

అర్హత మార్కులు

  • జనరల్: 30%
  • OBC/EWS: 25%
  • SC/ST: 20%
  • పయనీర్ పోస్టులకు కొంచెం భిన్నమైన అర్హత శాతం ఉంటుంది.

ట్రేడ్ టెస్ట్

రాత పరీక్ష తర్వాత సంబంధిత ట్రేడ్‌లో నైపుణ్య పరీక్ష ఉంటుంది. మొత్తం 50 మార్కులు, కనీసం 20 మార్కులు సాధించాలి.

ఇతర వివరాలు

  • డ్రైవర్ పోస్టులకు 10వ తరగతి + హెవీ వెహికల్ లైసెన్స్ అవసరం
  • ఇతర పోస్టులకు 10వ తరగతి + ఐటీఐ లేదా అనుభవం అవసరం
  • వయస్సు: 18–23 సంవత్సరాలు (డ్రైవర్‌కు 21–27 సంవత్సరాలు)
  • రిజర్వేషన్ ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి
  • దరఖాస్తు చివరి తేదీ: మే 19
  • ఫీజు: రూ.100 (SC/ST/మహిళలకు ఫీజు లేదు)
  • దరఖాస్తు చేయాల్సిన వెబ్‌సైట్: http://www.rect.crpf.gov.in/
Follow Us