GATE 2026 Result Date: గేట్‌ 2026 ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది.. ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

గేట్ 2026 పరీక్ష ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ క్రమంలో ఈ పరీక్షకు సంబంధించిన ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీ ఐఐటీ గువాహటి తాజాగా విడుదల చేసింది. ఆన్సర్‌ కీతో పాటు రెస్పాన్స్‌ షీట్లు, మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్లను కూడా ఐఐటీ గువాహటి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

GATE 2026 Result Date: గేట్‌ 2026 ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది.. ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
GATE 2026 result date

Updated on: Feb 23, 2026 | 7:41 AM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 23: గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్ 2026) పరీక్ష ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ క్రమంలో ఈ పరీక్షకు సంబంధించిన ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీ ఐఐటీ గువాహటి తాజాగా విడుదల చేసింది. ఆన్సర్‌ కీతో పాటు రెస్పాన్స్‌ షీట్లు, మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్లను కూడా ఐఐటీ గువాహటి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ వివరాలు నమోదు చేసి ఆన్సర్‌ కీ, క్వశ్చన్‌పేపర్‌, రెస్పాన్స్‌ షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కాగా గేట్‌ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 30 టెస్ట్ పేపర్లకు పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ కీ తాజాగా విడుదలైంది. దీనిపై అభ్యర్ధుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి.. నిపుణుల చేత వాటిని పరిశీలింపజేస్తారు. అనంతరం తుది ఆన్సర్‌ కీ రూపొందించి ఫలితాలు విడుదల చేస్తారు. గేట్ ఫలితాలు మార్చి 19వ తేదీన విడుదల చేయనున్నట్లు ఐఐటీ గువహటి ప్రకటించింది. కాగా గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్), ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్, కామర్స్, ఆర్ట్స్, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్‌లలో అండర్ గ్రాడ్యుయేట్-స్థాయి సబ్జెక్టులపై దేశ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష ఇది. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పి్స్తారు. కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా గేట్ స్కోర్ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తాయి.

గేట్‌ 2026 ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు షురూ..

తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్‌) పరిధిలోని పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు ఏప్రిల్‌ 20 నుంచి 27 వరకు నిర్వహిస్తామని టాస్‌ సంచాలకుడు పీవీ శ్రీహరి ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం, సాయంత్రం పరీక్షలు ఉంటాయని అన్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలు ఏప్రిల్‌ 28 నుంచి మే 5 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us