ESIC Recruitment: ఈఎస్‌ఐసీలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

|

Nov 18, 2021 | 7:00 AM

ESIC Recruitment 2021: ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఈఎస్‌ఐసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ...

ESIC Recruitment: ఈఎస్‌ఐసీలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Esic Jobs
Follow us on

ESIC Recruitment 2021: ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఈఎస్‌ఐసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ కోల్‌కతాలోని ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు ఖాళీలను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 34 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఉన్నాయి.

* పీడియాట్రిక్స్, ఎమర్జెన్సీ మెడిసిన్, డెర్మటాలజీ, రేడియాలజీ, అనెస్తీషియా, మైక్రోబయాలజీ, జనరల్‌ సర్జరీ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్‌ /డీఎన్‌బీ ఉత్తీర్ణత ఉండాలి.

* వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు 69 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను డీఎన్‌ ఆఫీస్‌, అకెడమిక్‌ బ్లాక్‌, 2వ ఫ్లోర్, ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌, జోకా, కోల్‌కతాకు పంపించాలి.

* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. రూ.1,01,000 నుంచి రూ.1,77,000 వరకు జీతాన్ని అందిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ 01-12-2021తో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Priyamani: ఎర్రచీరలో ప్రియమణి అదిరేటి అందాలు.. కుర్రాళ్ల మతులు పోవాల్సిందే.! వైరల్ పిక్స్!

CM KCR: గురువారం మహాధర్నాలో పాల్గొంటున్న సీఎం కేసీఆర్‌.. ధాన్యం కొనుగోలుపై ప్రధాని మోడీకి లెటర్‌..

వింటర్‏లో వావ్ అనిపించే వైజాగ్ అందాలు..