CUET UG 2026 Exam Date: సీయూఈటీ యూజీ 2026 దరఖాస్తులో సబ్జెక్టు మార్చుకోవాలా? ఇదే చివరి ఛాన్స్..

సెంట్రల్‌ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సీయూఈటీ యూజీ (CUET UG) 2026 పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. తాజా ప్రకటన మేరకు ఈ పరీక్షలు మే 11 నుంచి 31వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో..

CUET UG 2026 Exam Date: సీయూఈటీ యూజీ 2026 దరఖాస్తులో సబ్జెక్టు మార్చుకోవాలా? ఇదే చివరి ఛాన్స్..
CUET UG Subject Correction Window

Updated on: Apr 19, 2026 | 7:41 AM

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19: దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సీయూఈటీ యూజీ (CUET UG) 2026 పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. తాజా ప్రకటన మేరకు ఈ పరీక్షలు మే 11 నుంచి 31వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్టీయ కీలక అప్‌డేట్‌ జారీ చేసింది. సీయూఈటీ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తాము ఎంచుకున్న సబ్జెక్టులను మార్చుకోవడానికి ప్రత్యేక విండోను అందుబాటులోకి తెచ్చింది. ఈ అవకాశం ఆదివారం (ఏప్రిల్ 19వ తేదీ)తో ముగియనుంది. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ cuet.nta.nic.in లేదా nta.ac.in ద్వారా తమ సబ్జెక్టులను సవరించుకోవచ్చు.

కాగా సీయూఈటీ యూజీ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఫిబ్రవరి 26తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్ధులు సబ్జెక్టుల ఎంపికలో ఏవైనా మార్పులు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు తాజాగా నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఆదివారం ముగింపు సమయంలోపు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

సీయూఈటీ యూజీ-2026 కరెక్షన్‌ విండో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

SSC జేఈ పేపర్‌ 2 ఆన్సర్‌ కీ విడుదల.. డౌన్‌లింక్‌ ఇదే

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 7 న నిర్వహించిన జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) ఎగ్జామినేషన్ 2025 పేపర్ 2 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీని ఎస్సెస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆన్సర్‌ కీలతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్‌లను కూడా కమిషన్‌ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి కమిషన్ అధికారిక వెబ్‌సైట్ (https://ssc.gov.in) నుంచి రెస్పాన్స్ షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆదివారం (ఏప్రిల్ 19) ముగింపు సమయంలోగా రూ.50 ఫీజు చెల్లించి కీపై తమ అభ్యంతరాలను తెలపవచ్చు. అనంతరం తుది కీ తయారు చేసి.. ఫలితాలు వెల్లడిస్తారు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జేఈ పేపర్‌ 2 ఆన్సర్‌ కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us