CRPF Constable Jobs 2026: పదో తరగతి అర్హతతో 9,212 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎంపికైతే నెలకు రూ.70 వేల జీతం

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 9,212 ఉద్యోగాలను టెక్నికల్ ట్రేడ్స్‌మెన్, పయనీర్ విభాగాల్లో భర్తీ..

CRPF Constable Jobs 2026: పదో తరగతి అర్హతతో 9,212 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎంపికైతే నెలకు రూ.70 వేల జీతం
CRPF Constable Jobs

Updated on: Apr 09, 2026 | 3:11 PM

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 9,212 ఉద్యోగాలను టెక్నికల్ ట్రేడ్స్‌మెన్, పయనీర్ విభాగాల్లో భర్తీ చేయనుంది. వీటిల్లో టెక్నికల్ ట్రేడ్స్‌మెన్ విభాగంలో 9,195 పోస్టులు (పురుషులకు 9,103 పోస్టులు, మహిళలకు 92 పోస్టులు) ఉన్నాయి. పయనీర్ విభాగంలో (పురుషులకు) 17 వరకు పోస్టులు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్ 20, 2026వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లలో నైపుణ్యం ఉండాలి. డ్రైవర్ పోస్టులుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 1999 కంటే ముందు జనవరి 1, 2005 తర్వాత జన్మించి ఉండకూడదు. ఇక మోటార్ మెకానిక్ వెహికల్, కుక్, కార్పెంటర్, టెయిలర్, బార్బర్, సఫాయీ కర్మచారి తదితర పోస్టులకు 18 నుంచి 23 ఏళ్ల వయసు నిర్ణయించారు. జనవరి 2, 2003 కంటే ముందు జనవరి 1, 2008 తర్వాత జన్మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీకి ఐదేళ్లు, ఓబీసీ, ఈఎస్‌ఎంకు మూడేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉటుంది.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మే 19, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ పురుష అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికోద్యోగులకు ఎలాంటి ఫీజు లేదు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, పీఈటీ, పీఎస్‌టీ పరీక్షల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్ ఉద్యోగాల ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us