Coal India Recruitment 2022: నేటి నుంచి దరఖాస్తులు.. కోల్‌ ఇండియాలో 481 ఉద్యోగాలు..

|

Jul 08, 2022 | 1:19 PM

భారత ప్రభుత్వ బొగ్గుగనుల మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (Coal India Limited).. 481మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టు (Management Trainee posts)ల భర్తీకి దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమయింది..

Coal India Recruitment 2022: నేటి నుంచి దరఖాస్తులు.. కోల్‌ ఇండియాలో 481 ఉద్యోగాలు..
Coal India
Follow us on

Coal India Management Trainee Recruitment 2022: భారత ప్రభుత్వ బొగ్గుగనుల మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (Coal India Limited).. 481మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టు (Management Trainee posts)ల భర్తీకి దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమయింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా పర్సనల్‌ అండ్‌ హెచ్‌ఆర్‌, ఎన్విరాన్‌మెంట్‌, మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌, సేల్స్‌, కమ్యునిటీ డెవలప్‌మెంట్‌, లీగల్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ పీజీ/ పీజీ డిప్లొమా/ ఎంబీఏ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులు ఎవరైనా అధికారిక వెబ్‌సైట్‌ https://www.coalindia.in/login/లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 8 వరకు అన్‌లైన్‌ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. రాత పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. రాత పరీక్షలో ప్రతిభ కనబరచిన అభ్యర్ధులు నెలకు రూ.1.60,000ల జీతంతో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీగా ఉద్యోగం పొందవచ్చు. ఇతర పూర్తి వివరాల కోసం https://www.coalindia.in/ను సందర్శించవచ్చు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.