CIPET Hyderabad Jobs: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక.. సీపెట్ హైదరాబాద్‌లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..

|

Mar 12, 2022 | 9:13 AM

భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (CIPET Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల..

CIPET Hyderabad Jobs: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక.. సీపెట్ హైదరాబాద్‌లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..
Cipet Hyderabad
Follow us on

CIPET Hyderabad Faculty Recruitment 2022: భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (CIPET Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల (teaching jobs) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 14

పోస్టుల వివరాలు:

  • లెక్చరర్ పోస్టులు: 5 (కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌, ప్లాస్టిక్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, వర్క్‌ షాప్‌ ప్రాక్టీస్‌)
  • అసిస్టెంట్‌ ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్‌ పోస్టులు: 1
  • అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ పోస్టులు: 1
  • ఇన్‌స్ట్రక్టర్‌ (స్కిల్‌డెవలప్‌మెంట్‌) పోస్టులు: 4
  • కన్సల్టెంట్‌ ట్రైనీ (మొబిలైజేషన్‌) పోస్టులు: 2

పే స్కేల్‌: నెలకు రూ.20,000ల నుంచి రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెసలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: ప్రిన్సిపల్ డైరెక్టర్‌ అండ్‌ హెడ్‌, సీఎస్‌టీఎస్‌-హైదరాబాద్‌, ఐడీఏ, ఫేజ్‌-2, చర్లపల్లి, హైదరాబాద్‌ 500051.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NEIGRIHMS Jobs: రాత పరీక్షలేకుండానే..  నైగ్రిమ్స్‌లో 54 సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు.. అర్హతలు, ఇతర వివరాలివే..