
హైదరాబాద్, నవంబర్ 8: ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2026 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) ఇందౌర్ అడ్మిట్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. CAT 2026 పరీక్షను నవంబర్ 29న నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా దేశంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIMలు)తో పాటు ఇతర ప్రముఖ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థల్లో ఎంబీఏ, సంబంధిత మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు సాధించిన క్యాట్ స్కోరు, ఆయా విద్యాసంస్థల ప్రవేశ నిబంధనల ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి.
హాల్‌టికెట్‌లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే పరీక్ష నిర్వాహకులను సంప్రదించాలి. పరీక్ష రోజున అడ్మిట్ కార్డు ప్రింటెడ్ కాపీతో పాటు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. హాల్‌టికెట్ లేకుండా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
క్యాట్ 2027 హాల్ టికెట్ డౌన్ లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.