BSNL Recruitment 2022: బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపటితో ముగుస్తున్న దరఖాస్తు ప్రక్రియ..

|

Aug 29, 2022 | 4:31 PM

భారత ప్రభుత్వ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ చెందిన భారత సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) 100 గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులకు (Graduate, Technician Apprentice Posts) ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవడానికి రేపే..

BSNL Recruitment 2022: బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపటితో ముగుస్తున్న దరఖాస్తు ప్రక్రియ..
Bsnl
Follow us on

BSNL Graduate and Technician Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ చెందిన భారత సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) 100 గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులకు (Graduate, Technician Apprentice Posts) ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవడానికి రేపే ఆఖరు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఆగస్టు 30, 2022వ తేదీ ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ/మూడేళ్ల డిప్లొమా/టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎటువంటి రాత పరీక్షలేకుండానే అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. తుది ఎంపిక అనంతరం డిప్లొమా హోల్డర్స్‌కు నెలకు రూ.8000లు, డిగ్రీ/గ్రాడ్యుయేట్ హోల్డర్స్‌కు నెలకు రూ.9000ల వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు. ట్రైనింగ్‌ వ్యవధి ఏడాది పాటు ఉంటుంది. గతంలో అప్రెంటిస్‌గా పనిచేసినవారు లేదా అప్రెంటిస్‌ అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. పూర్తి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ చూడొచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.