BSNL Internship: ఆంధ్రప్రదేశ్‌ డిగ్రీ, బీటెక్‌ విద్యార్థులకు బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఇంటర్న్‌షిప్‌లు

ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, డిగ్రీ విద్యార్థులకు బీఎస్‌ఎన్‌లో ఇంటర్న్‌షిప్‌ అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌ (APSCHE) భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL)తో ఒప్పందం..

BSNL Internship: ఆంధ్రప్రదేశ్‌ డిగ్రీ, బీటెక్‌ విద్యార్థులకు బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఇంటర్న్‌షిప్‌లు
Bsnl Internship

Updated on: Sep 21, 2022 | 7:05 AM

BSNL Internship Program: ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, డిగ్రీ విద్యార్థులకు బీఎస్‌ఎన్‌లో ఇంటర్న్‌షిప్‌ అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌ (APSCHE) భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL)తో సెప్టెంబ‌రు 19న‌ ఒప్పందం కుదుర్చుకుంది. బీటెక్‌, డిగ్రీ చదివే విద్యార్ధులకు ఏపీ సర్కార్‌ 10 నెలలు ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రోగ్రాం కింద విద్యార్థులకు డిజిటల్‌, మోడ్రన్‌, వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ తదితర అంశాలపై ఇంటర్న్‌షిప్‌ అందించనున్నారు. ఇంటర్న్‌షిప్‌ వివరాలను జిల్లాల వారీగా అయా యూనివర్సిటీలకు బీఎస్‌ఎన్‌ఎల్‌ త్వరలో అందిస్తుందని ఉన్నత విద్యామండలి సెక్రటరీ నజీర్‌ అహ్మద్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us