
బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన బీఓబీ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ (BOB Capital Markets).. దేశ వ్యాప్తంగా ఉన్న పలు జోన్లలో బిజినెస్ డెవెలప్‌మెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 103 పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం బిజినెస్ డెవెలప్‌మెంట్ మేనేజర్ పోస్టు్ల్లో నార్త్ జోన్‌లో 37 పోస్టులు, వెస్ట్ జోన్‌లో 44 పోస్టులు, సౌత్ అండ్ ఈస్ట్ జోన్‌లో 22 పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 31, 2026వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే పాటు 6 నెలల పాటు క్యాపిటల్ మార్కెట్‌లో పని అనుభవం ఉండాలి. క్యాపిటల్ మార్కెట్‌లో డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్, సెల్లింగ్ బ్రోకింగ్‌లో ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. సేల్స్ అండ్ మార్కెటింగ్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఈమెయిల్ ద్వారా మార్చి 31, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఈమెయిల్ సబ్జెక్ట్ స్థానంలో Application for the post of Business Development Manager (Off Roll) అని తప్పనిసరిగా ఇవ్వవల్సి ఉంటుంది. ఎంపికైన వారిని ఫుల్ టైం పాటు సంబంధిత బ్రాంచుల్లో విధులు నిర్వహించవల్సి ఉంటుంది. హైదారబాద్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానాల్లో విధులు కేటాయిస్తారు.
ఈమెయిల్ ఐడీ: careers@bobcaps.in
బీఓబీ క్యాపిటల్‌లో ఉద్యోగాల దరఖాస్తుకు సంబంధించి ఇతర సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.