BIS Recruitment 2022: న్యూఢిల్లీకి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (Bureau of Indian Standards) సైంటిస్టు (Scientist Vacancies) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు
పోస్టు: సైంటిస్టు ఉద్యోగాలు
మొత్తం ఖాళీలు: 22
విభాగాల వారీగా ఖాళీల వివరాలు..
సివిల్ ఇంజనీరింగ్: 11
కెమికల్ ఇంజనీరింగ్: 4
టెక్స్‌టైల్ ఇంజనీరింగ్: 2
ఎలక్ట్రికల్ ఇంజీనిరంగ్: 5
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లో అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే 2019/2020/2021లకు సంబంధించి గేట్ స్కోర్ కూడా ఉండాలి.
పే స్కేల్: రూ.90,000 జీతంగా నెలకు చెల్లిస్తారు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు చివరితేదీ: ఉద్యోగ ప్రకటన వెలువడిన రోజునుంచి 21 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: