భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, మచిలీపట్నం యూనిట్లో.. ఒప్పంద ప్రాతిపదికన 37 ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందియన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధత స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్/బీఎస్సీ లేదా లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు అక్టోబర్ 1, 2022వ తేదీ నాటికి 28 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో నవంబర్ 26, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే దరఖాస్తు సమయలో ట్రైనీ ఇంజనీర్ పోస్టులకైతే జనరల్ అభ్యర్ధులు రూ.177, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకైతే రూ.472లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ఈ కింద సూచించిన విధంగా జీత భత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.