భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL Ghaziabad).. 141 ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిల్లో ట్రైనీ ఇంజినీర్ పోస్టులు 89 ఉండగా, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు 52 వరకు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధత స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో పనిలో 6 నెలల నుంచి 2 ఏళ్ల పని అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు సెప్టెంబర్ 30, 2022వ తేదీ నాటికి 28 నుంచి 32 ఏళ్లకు మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్లైన్ విధానంలో అక్టోబర్ 14, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష అక్టోబర్ 16వ తేదీన నిర్వహిస్తారు. ఎంపికైన వారికి కింది విధంగా జీత భత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.
ఇంటర్వ్యూ అడ్రస్: Little Flower Junior College, Opp. Survey of India, P&T Colony, Uppal, Hyderabad – 500039.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.