BECIL Jobs 2023: రాత పరీక్షలేకుండా.. ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు..నెలకు రూ.38,874ల జీతం..

|

Jan 17, 2023 | 1:51 PM

న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ .. ఒప్పంద ప్రాతిపదికన ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాలో పని చేయుటకు 18 ఈవీఎం కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

BECIL Jobs 2023: రాత పరీక్షలేకుండా.. ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు..నెలకు రూ.38,874ల జీతం..
BECIL New Delhi
Follow us on

న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ .. ఒప్పంద ప్రాతిపదికన ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాలో పని చేయుటకు 18 ఈవీఎం కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు కనీసం మూడేళ్ల పాటు పని అనుభవం ఉన్నవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 20 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్‌/ఓబీసీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కేటగిరీ అభ్యర్ధులు రూ.885, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్‌/పీహెచ్‌ అభ్యర్ధులు రూ.531లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. స్కిల్‌టెస్ట్‌/ ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.38,874ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.