Bank of Baroda Jobs 2025: ఎలాంటి రాత పరీక్ష లేకుండానే బ్యాంక్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే జాబ్‌ గ్యారెంటీ

దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ బ్యాంక్ ఆఫ్‌ బరోడా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్‌ 19వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..

Bank of Baroda Jobs 2025: ఎలాంటి రాత పరీక్ష లేకుండానే బ్యాంక్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే జాబ్‌ గ్యారెంటీ
Bank Of Baroda Manager Jobs

Updated on: Nov 19, 2025 | 10:03 AM

బ్యాంక్ ఆఫ్‌ బరోడా.. దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్‌ 19వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 82 పోస్టులను భర్తీ చేయనుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

పోస్టుల వివరాలు ఇవే..

  • జోనల్ రిసీవబుల్‌ మేనేజర్‌ పోస్టుల సంఖ్య: 13
  • రీజినల్‌ రిసీవబుల్‌ మేనేజర్ పోస్టుల సంఖ్య: 13
  • ఏరియా రిసీవబుల్‌ మేనేజర్ పోస్టుల సంఖ్య: 49
  • కంప్లియన్స్‌ మేనేజర్‌ పోస్టుల సంఖ్య: 1
  • కంప్లైంట్‌ మేనేజర్‌ పోస్టుల సంఖ్య: 1
  • ప్రాసెస్‌ మేనేజర్‌ పోస్టుల సంఖ్య: 1
  • వెండర్‌ మేనేజర్ పోస్టుల సంఖ్య: 1
  • ఫ్లోర్‌ మేనేజర్ పోస్టుల సంఖ్య: 3

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి పోస్టులను అనుసరించి 25 ఏళ్ల నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 9, 2025వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులు రూ.175 చొప్పున ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌ ద్వారా తెలుసుకోండి.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us