Assam Rifle Sports Recruitment 2022: స్పోర్ట్స్‌కోటా జాబ్స్‌! అసోం రైఫిల్స్‌ స్పోర్ట్స్ పర్సన్స్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నోటిఫికేషన్‌..

|

Mar 27, 2022 | 6:37 PM

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన షిల్లాంగ్‌లోని అసోం రైఫిల్స్‌ డైరెక్టర్ జనరల్ కార్యాలయం స్పోర్ట్స్ పర్సన్స్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ (Assam Rifles Sportsperson Rally) ద్వారా.. స్పోర్ట్స్‌ కోటాలో..

Assam Rifle Sports Recruitment 2022: స్పోర్ట్స్‌కోటా జాబ్స్‌! అసోం రైఫిల్స్‌ స్పోర్ట్స్ పర్సన్స్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నోటిఫికేషన్‌..
Assam Rifles Sportsperson Rally
Follow us on

Assam Rifles Meritorious Sports Person Recruitment 2022: భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన షిల్లాంగ్‌లోని అసోం రైఫిల్స్‌ డైరెక్టర్ జనరల్ కార్యాలయం స్పోర్ట్స్ పర్సన్స్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ (Assam Rifles Sportsperson Rally) ద్వారా.. స్పోర్ట్స్‌ కోటాలో రైఫిల్‌ మ్యాన్‌/రైఫిల్‌ ఉమెన్‌ (జనరల్ డ్యూటీ) పోస్టుల పోస్టుల (Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: రైఫిల్‌ మ్యాన్‌/రైఫిల్‌ ఉమెన్‌ పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 104

ఖాళీల వివరాలు: బాక్సింగ్‌-21, ఫుట్‌బాల్‌-20, రోయింగ్‌-18, ఆర్చెరీ-15, క్రాస్‌కంట్రీ-10, అథ్లెటిక్స్‌-10, పోలో-10

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ. 25,000ల నుంచి రూ.42,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే జాతీయ లేదా అంతర్జాతీయ క్రీడా పోటీలు/ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నమెంట్‌/నేషనల్‌ స్పోర్ట్స్‌లో పాల్గొని ఉండాలి.

ఎంపిక విధానం: ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, అచీవ్‌మెంట్స్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:
జనరల్‌ అభ్యర్ధులకు: రూ.100
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 30, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

CSIR-NCL Pune Jobs 2022: నెట్‌/గేట్‌ అర్హతతో నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు.. రూ.42 వేలు జీతం!