APVVP Prakasam Jobs: నిరుద్యోగులకు గమనిక.. ప్రకాశం జిల్లాలో 108 మెడికల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అర్హతలివే..

|

Feb 19, 2022 | 8:27 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ (APVVP) కమిషనర్‌ కార్యాలయం.. ప్రకాశం జిల్లా (Prakasam)లో ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

APVVP Prakasam Jobs: నిరుద్యోగులకు గమనిక.. ప్రకాశం జిల్లాలో 108 మెడికల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అర్హతలివే..
Ap Jobs
Follow us on

APVVP Prakasam District Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ (APVVP) కమిషనర్‌ కార్యాలయం.. ప్రకాశం జిల్లా (Prakasam)లో ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 108

పోస్టుల వివరాలు: థియేటర్ అసిస్టెంట్లు, రేడియోగ్రాఫర్‌, ఆడియోమిట్రిక్‌ టెక్నీషియన్‌, ల్యాబ్ అటెండెంట్లు, కౌన్సెలర్లు, పోస్టు మార్టం అసిస్టెంట్లు, బయోమెడికల్ ఇంజనీర్లు, జనరల్‌ డ్యూటీ అటెండెంట్లు, ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.15,000ల నుంచి రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీటెక్‌, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయ్యి ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: District coordinator of Hospital Services (APVVP), Prakasam District.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ. 500
  • ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు: రూ. 300
  • వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 23, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

APVVP Nellore Jobs: నిరుద్యోగులకు అలర్ట్‌..కడప జిల్లాలో 126 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..అకడమిక్‌ మెరిట్‌తో ఎంపికలు..