APVVP Kadapa Jobs 2022: పది/ఇంటర్‌ అర్హతతో.. ఏపీవీవీపీ కడపలో మెడికల్‌ ఉద్యోగాలు..దరఖాస్తు ఇలా..

|

Mar 25, 2022 | 5:48 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ (APVVP) కమిషనర్‌ కార్యాలయం.. వైఎస్సార్‌ కడప జిల్లా (YSR Kadapa District)లో ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి..

APVVP Kadapa Jobs 2022: పది/ఇంటర్‌ అర్హతతో.. ఏపీవీవీపీ కడపలో మెడికల్‌ ఉద్యోగాలు..దరఖాస్తు ఇలా..
Ap Jobs
Follow us on

APVVP Kadapa Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ (APVVP) కమిషనర్‌ కార్యాలయం.. వైఎస్సార్‌ కడప జిల్లా (YSR Kadapa District)లో ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 8

పోస్టుల వివరాలు:

  • రేడియోగ్రాఫర్‌ పోస్టులు: 1
  • థియేటర్ అసిస్టెంట్ పోస్టులు: 2
  • ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్ పోస్టులు: 2
  • ఆడియోమెట్రీషియన్‌ పోస్టులు: 2
  • ఎలక్ట్రీషియన్ పోస్టులు: 1

వయోపరిమితి: మార్చి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.12,000ల నుంచి రూ.17,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయ్యి ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: District Coordinator of Hospital Services (APVVP), New Collectorate, YSR Kadapa District, AP.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ. 500
  • ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు: రూ. 300
  • వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NITK Surathkal Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో.. ఎన్‌ఐటీ కర్ణాటకలో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో ఖాళీలు..