నిరుద్యోగులకు భారీ ఊరట.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితి పెంపు..!

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. APPSCతో పాటు ఇతర నియామక సంస్థల ద్వారా భర్తీ చేసే నాన్‌-యూనిఫాం ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది. ఈ సడలింపు 2027 సెప్టెంబర్‌ 30 వరకు అమల్లో ఉంటుంది. అయితే పోలీస్‌, ఎక్సైజ్‌, ఫైర్‌, జైళ్లు, అటవీ, రవాణా శాఖలకు చెందిన యూనిఫాం పోస్టులకు ఇది వర్తించదని సర్కార్ స్పష్టం చేసింది..

నిరుద్యోగులకు భారీ ఊరట.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితి పెంపు..!
Maximum Age Limit Increased in AP

Edited By:

Updated on: Sep 15, 2026 | 7:47 AM

అమరావతి, సెప్టెంబర్ 15: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. APPSCతో పాటు ఇతర నియామక సంస్థల ద్వారా భర్తీ చేసే నాన్-యూనిఫాం ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు గరిష్ట వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో వయోపరిమితి కారణంగా ఉద్యోగాలకు దూరమైన పలువురు అభ్యర్థులకు ప్రయోజనం కలగనుంది. ఇప్పటివరకు నాన్-యూనిఫాం ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు గరిష్ట వయోపరిమితి 34 సంవత్సరాలుగా ఉండగా.. తాజాగా దాన్ని 44 సంవత్సరాలకు పెంచారు. అంటే అర్హత కలిగిన అభ్యర్థులు అదనంగా 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపును పొందనున్నారు. ఈ ప్రత్యేక వయోపరిమితి సడలింపు 2027 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. ఈ కాలంలో చేపట్టే సంబంధిత నాన్-యూనిఫాం పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు పెంచిన గరిష్ట వయోపరిమితి వర్తించనుంది.

యూనిఫాం ఉద్యోగాలకు వర్తించదు

అయితే ఈ సడలింపు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు వర్తించదు. పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ, రవాణా శాఖలకు చెందిన యూనిఫాం ఉద్యోగాలు, అలాగే భౌతిక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండే పోస్టులకు ఈ వయోపరిమితి పెంపు వర్తించదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 1996లోని రూల్ 12 ప్రకారం వివిధ కేటగిరీలకు అందుతున్న అదనపు వయోపరిమితి సడలింపులు యథావిధిగా కొనసాగుతాయి. SC, ST, BC, EWS తదితర కేటగిరీలకు వర్తించే నిబంధనల ప్రకారం అదనపు వయోపరిమితి ప్రయోజనం పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ నిర్ణయంతో ముఖ్యంగా APPSC, ఇతర ప్రభుత్వ నియామక సంస్థల ద్వారా నిర్వహించే నాన్-యూనిఫాం ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు మరింత అవకాశం లభించనుంది. అయితే ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్‌లో పేర్కొన్న కట్‌ఆఫ్ తేదీ, వయోపరిమితి, అర్హతలు, సడలింపుల నిబంధనలను అభ్యర్థులు తప్పనిసరిగా పరిశీలించాల్సి ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us