AP TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష సమయాల్లో మార్పుల్లేవ్‌! కీలక తేదీలన్నీ ఒకేచోట

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్) 2026 హాల్‌టికెట్లను అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు ఈ కింది డైరెక్ట్ అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 5 నుంచి 21 వరకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు..

AP TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష సమయాల్లో మార్పుల్లేవ్‌! కీలక తేదీలన్నీ ఒకేచోట
AP TET Hall Ticket Download

Updated on: Jul 26, 2026 | 4:32 PM

అమరావతి, జులై 26: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) రాసే అభ్యర్థులకు అలర్ట్… ఏపీ టెట్ 2026 హాల్‌టికెట్లను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్, పాస్‌వర్డ్‌ ఎంటర్ చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని టెట్ కన్వీనర్ కృష్ణారెడ్డి సూచించారు. ఏపీ టెట్ ఆన్‌లైన్‌ పరీక్షలు ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజూ రెండు విడతల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి విడత ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో విడత మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. పరీక్ష ప్రారంభానికి కనీసం గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.

ఏపీ టెట్ 2026 హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఆలస్యంగా వచ్చే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించే అవకాశం ఉండదని హెచ్చరించారు. కాగా ఈ ఏడాది నిర్వహిస్తున్న ఏపీ టెట్‌కు మొత్తం 2,13,520 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 2,37,165 దరఖాస్తులు సమర్పించినట్లు టెట్ కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత తమ పేరు, ఫొటో, పరీక్ష కేంద్రం, తేదీ, సమయం వంటి వివరాలను ముందుగానే పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష రోజున హాల్‌టికెట్‌తో పాటు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు (ID Proof) కూడా తప్పనిసరిగా తీసుకెళ్లాలని తెలిపారు.

ఏపీ టెట్ 2026 హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ముఖ్యమైన తేదీలు

  • టెట్ ఆన్‌లైన్‌ రాత పరీక్షల తేదీలు: ఆగస్టు 5 నుంచి 21 వరకు
  • టెట్ ప్రాథమిక కీ విడుదల తేదీ: ఆగస్టు 24, 2026.
  • టెట్ ఫైనల్ కీ విడుదల తేదీ: సెప్టెంబర్ 8, 2026.
  • టెట్ ఫలితాల విడుదల తేదీ: సెప్టెంబర్ 15, 2026.

ఏపీ టెట్ 2026 హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us