పదో తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజు చెల్లింపునకు మరో అవకాశం!

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగించింది. డిసెంబర్ 5 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు. ఆ తర్వాత రూ.50, రూ.200, రూ.500 ఆలస్య రుసుములతో డిసెంబర్ 18 వరకు అవకాశం కల్పించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి..

పదో తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజు చెల్లింపునకు మరో అవకాశం!
AP SSC Exam Fee Last Date

Updated on: Nov 29, 2026 | 6:12 AM

అమరావతి, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం శుభవార్త అందించింది. పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కేవీ శ్రీనివాసులురెడ్డి వెల్లడించారు. విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా డిసెంబరు 5వ తేదీ వరకు పరీక్షల ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించలేని విద్యార్థుల కోసం ఆలస్య రుసుముతో మరికొన్ని రోజులు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.

ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు తేదీలు

  • డిసెంబరు 5 వరకు: ఎలాంటి ఆలస్య రుసుము లేదు.
  • డిసెంబరు 6 నుంచి 9 వరకు: రూ.50 ఆలస్య రుసుము.
  • డిసెంబరు 10 నుంచి 13 వరకు: రూ.200 ఆలస్య రుసుము.
  • డిసెంబరు 14 నుంచి 18 వరకు: రూ.500 ఆలస్య రుసుము.

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే పరీక్షల ఫీజు చెల్లించాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us