AP Inter Supply Results 2025: విద్యార్ధులకు అలర్ట్.. రేపే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు! ఎన్ని గంటలకంటే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండియర్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలను ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్ధులతోపాటు సబ్జెక్టుల్లో తమ స్కోర్‌ను మెరుగుపరచుకోవాలని భావించే విద్యార్ధులు కూడా రాశారు. అయితే ఈ పరీక్షల ఫలితాల విడుదలకు సంబంధించిన కీలక ఆప్ డేట్ తాజాగా ఇంటర్ బోర్డు జారీ చేసింది..

AP Inter Supply Results 2025: విద్యార్ధులకు అలర్ట్.. రేపే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు! ఎన్ని గంటలకంటే..
AP Inter Supply 2025 Results

Updated on: Jun 06, 2025 | 2:46 PM

అమరావతి, జూన్‌ 6: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల కోసం ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న విద్యార్ధులకు ఇంటర్‌ బోర్డు కీలక అప్‌డేట్ జారీ చేసింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శనివారం (జూన్‌ 7) విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్ధులు తమ హాల్‌ టికెట్‌ నంబర్‌ను నమోదు చేసి మార్కుల మెమోను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలాగే మనమిత్ర వాట్సప్‌ గ్రూప్‌ నెంబర్‌ 9552300009 ద్వారా కూడా ఫలితాలు క్షణాల్లో తనిఖీ చేసుకోవచ్చు.

కాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండియర్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలను ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్ధులతోపాటు సబ్జెక్టుల్లో తమ స్కోర్‌ను మెరుగుపరచుకోవాలని భావించే విద్యార్ధులు కూడా రాశారు. ఇక పరీక్షలు పూర్తయి దాదాపు నెల రోజులు గడుస్తున్నందున వేలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ల నిరీక్షణకు శనివారం తెరపడనుంది.

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ 2025 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇక ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాసిన విద్యార్థులు చాలా మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్షతోపాటు ఈఏపీసెట్‌, నీట్‌ వంటి పరీక్షలు కూడా రాశారు. తాజాగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ఇప్పటికే ఈ పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ విడుదలైంది. ఇక నీట్ ఫలితాల విడుదల తేదీ కూడా వెల్లడైంది. ఇంటర్‌ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫలితాలు విడదుల చేస్తే విద్యార్ధులు ఆయా ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us