Telugu News Education Career Jobs AP EAMCET 2025 Toppers List: full list of toppers in Engineering, Pharmacy and Agriculture streams in EAMCET
AP EAPCET 2025 Top Rankers List: ఈఏపీసెట్ ఫలితాల్లో టాప్ ర్యాంకర్లు వీరే.. ఎవరికెన్ని మార్కులొచ్చాయంటే?
ఈఏపీసెట్ 2025 ఫలితాలు ఆదివారం (జూన్ 8) సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో మొత్తం 75.67 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. తాజా ఫలితాల్లో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ స్ట్రీమ్‌లలో అబ్బాయిలే టాప్ ర్యాంకులు సొంతం చేసుకున్నారు. టాపర్స్ లిస్ట్ ఈ కింద చెక్ చేసుకోవచ్చు..
అమరావతి, జూన్ 9: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ 2025 ఫలితాలు ఆదివారం (జూన్ 8) సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో మొత్తం 75.67 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. తాజా ఫలితాల్లో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ స్ట్రీమ్‌లలో అబ్బాయిలే టాప్ ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన అవనగంటి అనిరుధ్ రెడ్డి 96.39 మార్కులతో ఫస్ట్ ర్యాంకు సాధించగా.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన మాండవ్యపురం భాను చరణ్ రెడ్డి 95.57 మార్కులతో సెకండ్ ర్యాంక్, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ 94.75 మార్కులతో మూడో ర్యాంక్ కైవసం చేసుకున్నారు.