AndhraPradesh Jobs: ప్రకాశం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు.. అర్హులెవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

|

Dec 04, 2021 | 10:58 AM

AndhraPradesh Jobs: ప్రకాశం జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖలో ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కాంట్రాక్ట్‌ విధానంలో...

AndhraPradesh Jobs: ప్రకాశం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు.. అర్హులెవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
Ap Govt Jobs
Follow us on

AndhraPradesh Jobs: ప్రకాశం జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖలో ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 127 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ల్యాట్‌ టెక్నీషియన్‌ (21), ఫిమేల్‌ నర్సింగ్ ఆర్డర్లీ (68), శానిటరీ అటెండర్‌ కమ్‌ వాచ్‌మెన్‌ (38) పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు అప్లై చేసుకునే వారు మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీలో డిప్లొమా/ బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏపీ పారా మెడికల్‌ బోర్డ్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు.

* ఫిమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు.

* శానిటరీ అటెండర్‌ కమ్‌ వాచ్‌మెన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదోతరగతి/ తత్సమాన ఉత్తీర్ణత పొంది ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను ది డిస్ట్రిక్ట్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్‌, ప్రకాశం జిల్లా, ఒంగోలు, జీజీహెచ్‌, కంపౌండ్‌ అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మెరిట్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 05-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Akhanda : నటసింహం “అఖండ” డిజిటల్ రైట్స్ దక్కించుకుంది ఎవరో తెలుసా..

Akhanda : నటసింహం “అఖండ” డిజిటల్ రైట్స్ దక్కించుకుంది ఎవరో తెలుసా..

Top 9 News: తెలుగు రాష్ట్రాల ట్రెండింగ్ వార్తలు.. పొలిటికల్ న్యూస్ సమాహారం “టాప్ 9 న్యూస్” (వీడియో)