Telugu News Education Career Jobs Andhra Pradesh Intermediate 1st and 2nd Year Public Examination Schedule Released, Check date wise here
AP Inter Public Exams 2026: ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ ఇదే.. ఏ పరీక్ష ఏ తేదీనంటే?
రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి, సెకండ్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు లాంగ్వేజ్ పరీక్షలు..
AP Inter 1st and 2nd Year Public Exams 2026 Time Table
అమరావతి, అక్టోబర్ 3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి, సెకండ్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు లాంగ్వేజ్ పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ఇక మార్చి 24తో అన్ని పరీక్షలు పూర్తి కానున్నాయి. ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 23వ తేదీన ఉంటుంది. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభమై 10వ తేదీతో ముగుస్తాయి.
ఏపీ ఇంటర్ 1st ఇయర్ పరీక్షల పూర్తి షెడ్యూల్ 2026 ఇదే..
ఫిబ్రవరి 23న లాంగ్వేజ్ పేపర్ 1 పరీక్ష
ఫిబ్రవరి 25న ఇంగ్లీష్ పేపర్ 1 పరీక్ష
ఫిబ్రవరి 27న హిస్టరీ పేపర్ 1 పరీక్ష
మార్చి 2న మ్యాథ్స్ పేపర్ 1 పరీక్ష
మార్చి 5న జూలాజీ / మ్యాథ్స్ 1బి పరీక్ష
మార్చి 7న ఎకనామిక్స్ 1 పరీక్ష
మార్చి 10న ఫిజిక్స్ 1 పరీక్ష
మార్చి 12న కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 1 పరీక్ష
మార్చి 14న సివిక్స్ 1 పరీక్ష
మార్చి 17న కెమిస్ట్రీ 1 పరీక్ష
మార్చి 20న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 1 పరీక్ష
మార్చి 24న మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ 1 పరీక్ష
ఏపీ ఇంటర్ 2nd ఇయర్ పరీక్షల పూర్తి షెడ్యూల్ 2026 ఇదే..
ఫిబ్రవరి 24న లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష
ఫిబ్రవరి 26న ఇంగ్లీష్ పేపర్ 2 పరీక్ష
ఫిబ్రవరి 28న హిస్టరీ / బోటనీ పేపర్ 2 పరీక్ష
మార్చి 3న మ్యాథ్స్ పేపర్ 2 ఎ / సివిక్స్ 2 పరీక్ష
మార్చి 6న జూలాజీ 2 / ఎకనామిక్స్ 2 పరీక్ష
మార్చి 9న మ్యాథ్స్ పేపర్ 2 బి పరీక్ష
మార్చి 11న ఫిజిక్స్ / కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 2 పరీక్ష
మార్చి 13న ఫిజిక్స్ 2 పరీక్ష
మార్చి 16న మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ 2 పరీక్ష
మార్చి 18న కెమిస్ట్రీ 2 పరీక్ష
మార్చి 23న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 2 పరీక్ష