AIIMS Recruitment: ఢిల్లీ ఎయిమ్స్‌లో 194 ఉద్యోగాలు.. మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..

AIIMS Recruitment: ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలోని ఈ వైద్య సంస్థలో నాన్‌ అకడమిక్‌ విభాగంలో...

AIIMS Recruitment: ఢిల్లీ ఎయిమ్స్‌లో 194 ఉద్యోగాలు.. మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..

Updated on: Jun 05, 2022 | 8:41 PM

AIIMS Recruitment: ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలోని ఈ వైద్య సంస్థలో నాన్‌ అకడమిక్‌ విభాగంలో ఉన్న 194 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా నేరుగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా 194 జూనియర్‌ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* కమ్యూనిటీ మెడిసిన్‌, సీటీవీఎస్‌, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోరేడియాలజీ, సైకియాట్రీ, రేడియోథెరపీ, కార్డియాలజీ, రేడియాలజీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌/ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసి ఉండాలి. అలాగే మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ)/ డీసీఐలో తప్పకుండా రిజిస్టర్‌ అయి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌ ఫైనల్‌ ఎగ్జామ్స్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 17-06-2022 చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us