AIIMS Recruitment 2021: మంగళగిరి ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకునేందుకు ఎప్పటి వరకు అంటే..

|

May 05, 2021 | 1:37 PM

AIIMS Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS) వివిధ కేటగిరిలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ (గ్రూప్‌ ఏ)పోస్టుల.

AIIMS Recruitment 2021: మంగళగిరి ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకునేందుకు ఎప్పటి వరకు అంటే..
Follow us on

AIIMS Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS) వివిధ కేటగిరిలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ (గ్రూప్‌ ఏ)పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులు, ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 119 పోస్టులను భర్తీ చేయనుంది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం పోస్టులు: 119

ఇందులో ప్రొఫెసర్‌ 29, అడిష‌న‌ల్ ప్రొఫెస‌ర్ 18, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ 72 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు:

స‌ంబంధిత స‌బ్జెక్టులో ఎండీ లేదా ఎమ్మెస్ చేసి ఉండాలి. నాన్‌మెడిక‌ల్ అభ్యర్థులైతే హ్యూమన్‌ అనాటమీలో ఎమ్మెస్సీ, మెడికల్‌ ఫిజియాల‌జీ, మెడిక‌ల్ బ‌యోకెమిస్ట్రీలో ఎమ్మెస్సీ చేసి ఉండాలి.
ఈ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారానే చేసుకోవాలి. ఫీజు రూ.3 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2500 పీడబ్ల్యూబీటీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మే16. వెబ్‌సైట్‌: https://www.aiimsmangalagiri.edu.in/

ఇవీ కూడా చదవండి:

Defence Services Staff College Recruitment 2021: ఇంట‌ర్ అర్హ‌త‌తో డిఫెన్స్ ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

NEET PG Exams: కరోనా ఎఫెక్ట్… నీట్ 2021 పరీక్షలు మరో నాలుగు నెలలు వాయిదా..!