AIIMS Jodhpur Jobs 2022: నెలకు రూ.1,42,400ల జీతంతో.. ఇంటర్‌/డిప్లొమా అర్హతతో ఎయిమ్స్‌లో 110 ఉద్యోగాలు..

|

Apr 10, 2022 | 10:11 AM

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందని జోధ్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (AIIMS Jodhpur).. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల..

AIIMS Jodhpur Jobs 2022: నెలకు రూ.1,42,400ల జీతంతో.. ఇంటర్‌/డిప్లొమా అర్హతతో ఎయిమ్స్‌లో 110 ఉద్యోగాలు..
Aiims Jodhpur
Follow us on

AIIMS Jodhpur Assistant Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందని జోధ్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (AIIMS Jodhpur).. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల (Assistant Engineer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 110

పోస్టుల వివరాలు: నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.25,500ల నుంచి రూ.1,42,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్‌/తత్సమాన అర్హత, డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, బీఎస్సీ, బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంఏ/ఎమ్మెస్సీ, బీఈ/బీటెక్‌/ఎంసీఏ, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము:
జనరల్‌ అభ్యర్ధులకు: రూ.1,000
ఎస్సీ/ఎస్టీ/పీడ‌బ్ల్యూడీ/మ‌హిళ‌ల అభ్యర్ధులకు: రూ.200

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 23, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Free Police Training: పోలీస్‌ జాబ్‌ ఆశావహులకు గుడ్‌న్యూస్‌!.. తెలంగాణ పోలీస్‌ శాఖ ఆధ్వర్యలో 90 రోజుల పాటు ఉచిత శిక్షణ