10th Class Exams: 78 ఏళ్ల స్వతంత్ర్య భారతంలో ఇదో విచిత్రం.. ఆ ఊరిలో తొలిసారి టెన్త్‌ పరీక్షలు!

దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇప్పటికి 78 ఏళ్లు గడిచాయి. కానీ ఇప్పటికీ పలు మారుమూల ప్రాంతాల్లో స్వాంత్ర్యం పూర్వం నాటి పరిస్థితిలు ఉన్నాయి. ఊహకే అంతనంత వెనుకబడి ఉన్న అలాంటి ప్రాంతం ఒకటి బీహార్‌ ఉంది. మావోయిస్టు ప్రభావిత జముయీ జిల్లాలోని పలు మారుమూల గ్రామాల్లో ఇప్పటి వరకు..

10th Class Exams: 78 ఏళ్ల స్వతంత్ర్య భారతంలో ఇదో విచిత్రం.. ఆ ఊరిలో తొలిసారి టెన్త్‌ పరీక్షలు!
12 Children From 2 Bihar Villages To Appear For Matriculation Exams

Updated on: Dec 25, 2025 | 4:27 PM

దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇప్పటికి 78 ఏళ్లు గడిచాయి. కానీ ఇప్పటికీ పలు మారుమూల ప్రాంతాల్లో స్వాంత్ర్యం పూర్వం నాటి పరిస్థితిలు ఉన్నాయి. ఊహకే అంతనంత వెనుకబడి ఉన్న అలాంటి ప్రాంతం ఒకటి బీహార్‌ ఉంది. మావోయిస్టు ప్రభావిత జముయీ జిల్లాలోని పలు మారుమూల గ్రామాల్లో ఇప్పటి వరకు ఒక్కరు కూడా పదో తరగతి పరీక్షలు రాయలేదు. ఎవరూ పదో తరగతి వరకు చదవలేకపోయారు. అయితే ఓ స్వచ్ఛంద సంస్థ చొరవతో ఈ ఏడాది తొలిసారి కొందరు విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. జముయి – ముంగేర్‌ జిల్లాల సరిహద్దులోని భీమ్‌బాంధ్‌ అడవుల్లో ఉన్న గిరిజన గ్రామాల పరిస్థితి ఇదీ. ఒకప్పుడు మావోయిస్టులకు అడ్డాగా ఉన్న ఈ గిరిజన ప్రాంతాలు చదువుకు దూరంగా ఉన్నాయి. ముఖ్యంగా గుర్మాహా, చోర్మారా గ్రామాలు మావోయిస్టుల డెన్‌లుగా ఉండేవి.

గ్రామాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో విద్య పూర్తయ్యాక పిల్లలను కూలీ పనులకు తీసుకువెళ్లడం ఇక్కడి వారికి అలవాటు. ఈ నేపథ్యంలో సమగ్ర సేవాసంస్థ చొరవ తీసుకుని పిల్లల తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించారు. ఈ క్రమంలో కొంత మంది పిల్లలను భీమ్‌బాంధ్‌ కమ్యూనిటీ హైస్కూలులో ఈ సంస్థ చేర్పించి విద్య కొనసాగేలా చర్యలు తీసుకన్నారు. అంతేకాదు వారికి సైకిళ్లు, యూనిఫాం, పుస్తకాలు ఇచ్చి ప్రోత్సహించింది. ప్రస్తుతం ఈ రెండు గ్రామాల నుంచి 12 మంది విద్యార్థులు తొలిసారి ఓపెన్‌ టెన్త్‌ పరీక్షలు రాయబోతున్నారు. ఈ మేరకు సమగ్ర సేవాసంస్థ కార్యదర్శి మాకేశ్వర్‌ వెల్లడించారు.

ఐబీపీఎస్‌ ఆర్‌బీబీ పీఓ 2025 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఆర్‌ఆర్‌బీ ప్రొబేషనరీ ఆఫీసర్‌ (PO) 2025 ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధించిన ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) విడుదల చేసింది. ఈ మేరకు స్కోర్‌ కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఐబీపీఎస్‌ ఆర్‌బీబీ పీఓ 2025 ప్రిలిమ్స్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.