ఇల్లు కొనాలని చూస్తున్నారా.. కేవలం రూ.80 మాత్రమే.. ఎక్కడంటే.?

ఇల్లు కొనుక్కోవాలన్నది ప్రతి ఒక్కరి కల. అయితే పెరుగుతున్న రేట్ల దృష్ట్యా ఇల్లు కట్టాలన్న.. కొనుక్కోవాలన్నా అందరికి సాధ్యం కానీ పని. ఎక్కడికక్కడే డెవలప్‌మెంట్ జరుగుతూ భారీ రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ బాధలు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాదాపు రూ.80కే సొంత ఇంటి కల మనం నెరవేర్చుకోవచ్చు. అయితే అది మన దేశంలో కాదండోయ్.. ఈ సరికొత్త పథకం ఇటలీలో అమలులోకి వచ్చింది. ఇటలీలో ఇల్లు కొనాలంటే.. కేవలం ఒక్క యూరో మాత్రమే […]

ఇల్లు కొనాలని చూస్తున్నారా.. కేవలం రూ.80 మాత్రమే.. ఎక్కడంటే.?
Follow us

| Edited By:

Updated on: Oct 04, 2019 | 11:52 AM

ఇల్లు కొనుక్కోవాలన్నది ప్రతి ఒక్కరి కల. అయితే పెరుగుతున్న రేట్ల దృష్ట్యా ఇల్లు కట్టాలన్న.. కొనుక్కోవాలన్నా అందరికి సాధ్యం కానీ పని. ఎక్కడికక్కడే డెవలప్‌మెంట్ జరుగుతూ భారీ రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ బాధలు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాదాపు రూ.80కే సొంత ఇంటి కల మనం నెరవేర్చుకోవచ్చు. అయితే అది మన దేశంలో కాదండోయ్.. ఈ సరికొత్త పథకం ఇటలీలో అమలులోకి వచ్చింది.

ఇటలీలో ఇల్లు కొనాలంటే.. కేవలం ఒక్క యూరో మాత్రమే చెల్లిస్తే చాలు. ఇక అది మన భారత కరెన్సీలో అటు ఇటుగా రూ.80. ఆ దేశంలో ఉన్న సిసిలీ ద్వీపంలోని సంబూకా అనే గ్రామం ఈ ‘ఒక్క యూరోకే ఇల్లు పథకం’ ప్రకటించింది. నగరాలకు, విదేశాలకు ఉద్యోగుల వేటలో పడి ప్రజలు వలస వెళ్లిపోతుండటంతో యూరోప్‌లోని చిన్న చిన్న ప్రాంతాలన్నీ ఖాళీ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం సంబూకా గ్రామం కూడా ఇదే సమస్యను ఎదుర్కుంటోంది. ఆ గ్రామంలో ఇప్పుడు సుమారు 5,800 మాత్రమే జనాభా ఉన్నారు.

దీంతో ఆ గ్రామపాలక సంస్థ ‘ఒక్క యూరోకే ఇల్లు’ అనే పథకాన్ని ప్రారంభించింది. విదేశాలకు వలస వెళ్ళిపోయిన వారి ఇండ్లు పాతపడిపోయి.. శిథిలావస్థకు చేరుకోవడంతో.. వాటిని యజమానులు దగ్గర నుంచి కొనుగోలు చేసి.. ఈ పథకం కింద అమ్మాలని నిర్ణయించారు. ప్రపంచంలో ఎక్కడివారైనా ఇక్కడ ఇల్లు కొనుక్కుని నివసించవచ్చని.. అయితే కొన్నవారు మాత్రం మూడేళ్లలోగా ఆ ఇళ్లను మరమ్మతులు చేయించుకోవాలని షరతు పెట్టారు. ఇక వాటికి భారీగా ఖర్చు అయ్యే అవకాశం ఉన్నా.. చాలామంది ఈ పథకానికి ఆకర్షితులై అక్కడ ఇళ్ళను కొనుగోలు చేశారట. చూశారా ఇలాంటి పథకం మన దగ్గర కూడా అమలవుతే ఎంత బాగుంటుందో కదా!

Latest Articles
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
పిల్లల్ని వేటకు సిద్ధం చేస్తోన్న సింహం.. ట్రైనింగ్ వీడియో చూస్తే
పిల్లల్ని వేటకు సిద్ధం చేస్తోన్న సింహం.. ట్రైనింగ్ వీడియో చూస్తే
వామ్మో.. ఇదేం ఊచకోత భయ్యా.. 17 సీజన్లలో తొలిసారి ఇలా..
వామ్మో.. ఇదేం ఊచకోత భయ్యా.. 17 సీజన్లలో తొలిసారి ఇలా..