WhatsApp: వాట్సప్‌లో సీక్రెట్ ఫీచర్.. స్పామ్ కాల్స్ రాకుండా చెక్.. ఈ ఒక్క సెట్టింగ్..

Updated on: Jun 02, 2026 | 8:32 PM

వాట్సప్‌లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు వస్తూ ఉంటాయి. అందులో భాాగంగా మరో కొత్త ఫీచర్ కూడా ఉంది. అదే స్పామ్ కాల్స్‌ను నివారించడం. ఈ ఫీచర్ ద్వారా వాట్సప్‌లో వచ్చే స్పామ్ కాల్స్‌ను నిలిపివేయవచ్చు. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే..

1 / 5
ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ అనేది తప్పనిసరి అయిపోయింది. ఇది లేకపోతే ఏ పనులు అవ్వనంతగా మన శరీరంలో ఒక భాగంగా మారిపోయిందని చెప్పవచ్చు. ఒక నిత్యావసర వస్తువుగా దీనిని భావిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. చాలా పనులు సెకన్లలోనే సులువుగా పూర్తి చేయవచ్చు. ఆఫీస్, వ్యాపార, కుటుంబ అవసరాల కోసం స్మార్ట్ ఫోన్ చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు

2 / 5
అయితే ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఆఫీస్, వ్యాపార పనుల కోసం, కుటుంబసభ్యులతో ముచ్చటించడం కోసం వాట్సప్ వాడుతుంటారు. ఇక ఫొటోలు సెండ్ చేసుకోవడం, వీడియో కాల్స్ కోసం కూడా ఉపయోగిస్తుంటారు. వాట్సప్‌లో కొన్నిసార్లు స్పామ్ కాల్స్ వచ్చే అవకాశముంటుంది. వీటికి చెక్ పెట్టేందుకు వాట్సప్ అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. చాలామందికి దీని గురించి తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు.

3 / 5
వాట్సప్‌ ద్వారా అనేక మెసాలు జరుగుతున్నాయి. దీంతో వీటిని అరికట్టేందుకు కొత్త ఫీచర్ అందుబాటులో ఉంది. ఒకే ఒక్క సెట్టింగ్ మీరు వాట్సప్‌లో ఆన్ చేసుకుంటే మీకు స్పామ్ కాల్స్ అనేవి రావు. సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అనే ఫీచర్ ద్వారా మీరు స్పామ్ కాల్స్‌ను నివారించవచ్చు. తెలియని నెంబర్ల నుంచి కాల్స్ వచ్చినప్పుడు చాలామంది సంకోచిస్తూ ఉంటారు. అలాంటివారికి ఇది మంచి ఫీచర్.

4 / 5
ఫోన్‌లోని కాంటాక్ట్ లిస్ట్, వాట్సప్ కాల్ లాగ్ ద్వారా ఈ ఫీచర్ పనిచేస్తుంది. మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని నెంబర్ నుంచి మీకు వాట్సప్‌లో కాల్ వచ్చినా లేదా ఆ నెంబర్‌తో మీరు ఒక్కసారి కూడా మాట్లాడకపోయినా దాని నుంచి వచ్చే వాయిస్ లేదా వీడియో కాల్‌ను  ఆటోమేటిక్‌గా మ్యూట్ చేస్తుంది. అయితే మీరు ఆ నెంబర్‌తో ఒక్కసారైనా కాల్ మాట్లాడి ఉంటే ఫీచర్ పనిచేయదు.

5 / 5
ఈ ఫీచర్ ఉపయోగించుకోవాలంటే ముందుగా వాట్సప్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత మూడు చుక్కలపై క్లిక్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లి సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అనే ఆప్షన్ ఎనుబేల్ చేసుకోవాలి. దీంతో మీకు ఇక స్పామ్ కాల్స్ అనేవి రావు.

Follow Us