Credit Card: క్రెడిట్ కార్డు చాలా రోజులు ఉపయోగించలేదా..? జాగ్రత్త.. ఈ సమస్యలు మీకు తప్పవ్..

Updated on: Oct 23, 2026 | 10:18 PM

కొంతమంది దగ్గర ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటాయి. ఇటీవల ఎవరి దగ్గర చూసినా ఏదొక క్రెడిట్ కార్డు అనేది ఉంటుంది. కానీ కొంతమంది ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తే.. మరికొంతమంది అసలు వినియోగించరు. ఇలా వినియోగించకుండా ఉంటే నష్టం జరుగుతుందా?

1 / 5
కొంతమంది క్రెడిట్ కార్డు తీసుకుంటారు. కానీ దానిని ఉపయోగించుకోకుండా తమ వద్దే ఉంచుకుంటారు. కొంతమంది దగ్గర ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉంటాయి. వాటిల్లో ఏదైనా ఒక కార్డును ఉపయోగించకుండా అలాగే పెట్టుకుంటారు. ఒక కార్డుపై ఆఫర్లు ఉన్నప్పుడు.. మిగతా కార్డును చాలాకాలంగా ఉపయోగించరు. క్రెడిట్ కార్డు చాలాకాలం పాటు ఉపయోగించకపోతే ఏమవుతుందనేది చూద్దాం.

2 / 5
క్రెడిట్ కార్డు తీసుకుని ఉపయోగించకపోతే  సిబిల్ స్కోర్‌పై ప్రభావితం పడుతుందా..? అంటే అవుననే చెప్పవచ్చు.  మీరు చాలాకాలం పాటు ఉపయోగించకపోతే దానిని బ్యాంక్ లేదా మీకు జారీ చేసి సంస్థ పర్మినెంట్‌గా మూసివేసే అవకాశముంది. ఇలా మూసివేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్‌పై నెగిటివ్ ప్రభావం పడుతుంది.

3 / 5
కొన్ని ఆర్ధిక సంస్థలు క్రెడిట్ కార్డు క్లోజ్ చేసేముందు మీకు సమాచారం అందిస్తాయి. మరికొన్ని సంస్థలు మీకు తెలియకుండానే కార్డును మూసివేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీ క్రెడిట్ స్కోర్‌పై పరోక్ష ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది. క్రెడిట్ కార్డు మూసివేయడం వల్ల మీ క్రెడిట్ పరిమితి తగ్గడమే కాకుండా క్రెడిట్ వినియోగ నిష్పత్తి పెరుగుతుంది.

4 / 5
అంతేకాకుండా క్రెడిట్ ప్రొఫైల్ కూడా సిబిల్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది. మీ పాత క్రెడిట్ కార్డ్ మూతపడటం వల్ల క్రెడిట్ చరిత్ర దెబ్బతింటుంది. ఇది సిబిల్ స్కోర్‌పై ప్రభావితం చూపుతుంది. దీంతో క్రెడిట్ కార్డు తీసుకుంటే సరిపోదు.. దానిని తెలివిగా ఎలా ఉపయోగించాలనేది తెలుసుకోవాలి.

5 / 5
మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే దానిని అప్పుడప్పుడు ఉపయోగించండి. కరెంట్, వాటర్, గ్యాస్ లాంటి యుటిలిటీ బిల్లుల చెల్లింపులకు ఉపయోగించండి. పెట్రోల్ ఖర్చుల కోసం కూడా వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత గడువులోగా బిల్లు చెల్లించడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ మెరుగవుతుంది. అత్యవసర సమయాల్లో మీకు క్రెడిట్ పరిమితి కూడా ఉంటుంది. దీంతో క్రెడిట్ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవడం ఉత్తమం.

Loading...
Unable to load recommendations.
Follow Us