
ప్రతీఒక్కరి చేతుల్లోకి స్మార్ట్‌ఫోన్ వచ్చేయడం, ఇంటర్నెట్ సౌకర్యం నిరంతరం అందుబాటులో ఉంటుండటంతో.. భారతదేశంలో డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం లేదా నేరుగా మొబైల్ నెంటర్ ఎంటర్ చేయడం ద్వారా క్షణాల్లోనే నిధుల బదలీ జరుగుతుంది. దేశంలో డిజిటల్ లావాదేవీల వాటా అధికంగా ఉందని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. ఇక డిజిటల్ చెల్లింపులకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. యూపీఐ, ఆర్టీజీఎస్, నెఫ్ట్ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. వీటిల్లో ఆర్‌టిజిఎస్ మొదటి స్థానంలో ఉంది.
చిన్న లావాదేవీలకు సంబంధించి UPI అనేది దేశంలో బాగా పాపులర్ అయింది. 97 శాతం కంటే ఎక్కువ చిన్న డిజిటల్ చెల్లింపులు UPI ద్వారానే జరుగుతున్నాయి. ఇక అధిక మొత్తంత్ కూడిన చెల్లింపులు RTGS ద్వారా జరుగుతున్నాయి. అధిక విలువ గల లావాదేవీల్లో 65 శాతానికిపైగా చెల్లింపులు RTGS ద్వారానే జరుగుతున్నాయి. అత్యధిక మొత్తంలో చెల్లింపులు ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా జరుగుతాయి. దేశంలోని మొత్తం రిటైల్ డిజిటల్ చెల్లింపులలో ఏకంగా 85 శాతం వాటా యూపీఐది ఉంది. ప్రజలు కిరాణా సామాను, కూరగాయలు, చిన్న దుకాణాలు, రోజువారీ వ్యక్తిగత లావాదేవీల కోసం యూపీఐను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అధిక విలువ గల లావావేవీల్లో RTGS 68.6 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది.
RTGS వ్యవస్థను ప్రధానంగా వ్యాపారాలు, పెద్ద కంపెనీలు, సంస్థల మధ్య జరిగే భారీ స్థాయి ఆర్థిక లావాదేవీల కోసం ఉపయోగిస్తారు. చిన్న లావాదేవీలకు అయితే యూపీఐ బెస్ట్ ఆప్షన్ అని, పెద్ద లావాదేవీలు అయితే ఆర్టీజీఎస్ సురక్షితంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.