Test Drive: ఈ రోజుల్లో కార్లు కొనడం సాధారణంగా మారిపోతుంది. ఎంతో మంది సులభమైన, సుఖమైన ప్రయాణం కోసం అలవాటు పడుతున్నారు. స్థోమత ఉన్నవాళ్లు కొత్తకార్లు, స్థోమత లేని వాళ్లు సెకండ్ హ్యాండ్ కార్ల వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే కారు ఏదైనా సరే కొనుగోలు చేసే ముందు దాని కారు గురించి పూర్తిగా అవగాహన ఉండి తీరాలి. ఏ మాత్రం అనుభవం లేకుండా కారును కొంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో మార్కెట్లో రకరకాల కార్లు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని కార్లలు అద్భుతమైన ఫీచర్స్, మరికొన్ని కార్లలో సాధారణమైన ఫీచర్స్ ఉంటున్నాయి. కారు కొనేముందు ఏ కారు అయితే బెస్ట్ అనే విషయాన్ని తెలుసుకోవాలి. అయితే మీరు కొత్త కారు కొనడానికి ముందు చాలా మంది ఆ కారుని టెస్ట్ డ్రైవ్ కూడా తీసుకుంటారు. ఇది పరిమిత సంఖ్యలో కిలోమీటర్లు, పరిమిత సమయం మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో చాలా సార్లు మనం కొన్ని ముఖ్యమైన విషయాలను విస్మరిస్తాము. దీని వల్ల ప్రజలు తమకు తాముగా సరైన కారును ఎంచుకోవడంలో తప్పులు చేస్తారు. అందుకే టెస్ట్ డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో సరైన కారును ఎంచుకోకుంటే లక్షలాది రూపాయలు వృథా అవుతాయి. అందువల్ల ఏదైనా కారు కొనడానికి ముందు, దాని గురించి ఇచ్చిన సమాచారాన్ని జాగ్రత్తగా చదవడం ముఖ్యం. అలాగే దాని కొలతలు, వీల్‌బేస్ మొదలైనవాటిని బాగా అర్థం చేసుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి