Tea Price: దేశంలో గతేడాది కంటే 25 శాతం పెరిగిన టీ ధరలు..ఎగుమతులపై ధరల ప్రభావం..వచ్చే నెలలో తగ్గే అవకాశం!

|

Jun 24, 2021 | 9:12 PM

Tea Price: కరోనా మహమ్మారి వైపు..అననుకూల వాతావరణం మరోవైపు.. టీ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపించాయి. అస్సాం టీ ఉత్పత్తి కేంద్రాల్లో గతేడాది ఉత్పత్తి తగ్గిపోయింది.

Tea Price: దేశంలో గతేడాది కంటే 25 శాతం పెరిగిన టీ ధరలు..ఎగుమతులపై ధరల ప్రభావం..వచ్చే నెలలో తగ్గే అవకాశం!
Tea Price Increased
Follow us on

Tea Price: కరోనా మహమ్మారి వైపు..అననుకూల వాతావరణం మరోవైపు.. టీ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపించాయి. అస్సాం టీ ఉత్పత్తి కేంద్రాల్లో గతేడాది ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ కారణంగా వార్షిక ప్రాతిపదికన టీ ధరలో 25% పెరుగుదల చోటుచేసుకుంది. అయితే, జూలైలో ఉత్పత్తి పెరిగిన తరువాత ధరలు తగ్గుతాయని వ్యాపారులు భావిస్తున్నారు. దేశంలోని టీలో సగానికి పైగా అస్సాం నుండే ఉత్పత్తి అవుతుంది. ఈ ఏడాది గౌహతి, కోల్‌కతాలో జరిగిన మొదటి 23 వారపు వేలంలో అస్సాం టీ సగటు ధర కిలో 224 రూపాయలకు చేరుకుంది. 2020 ఇదే కాలంలో ఇది కిలో 178.6 రూపాయలుగా ఉండేది. ఇందులో సాంప్రదాయ టీ, సిటిసి టీలు ఉన్నాయి. టీ బ్రోకరేజ్ సంస్థ పెర్కార్న్ ప్రకారం, గౌహతి టీ వేలం కేంద్రంలో (జిటిఎసి) ఈ ఏడాది జూన్ 11 వరకు ఈ రెండు టీల సగటు వేలం ధర కిలోకు 212 రూపాయలకు చేరుకుంది.

తక్కువ దిగుబడి కారణంగా..

గత ఏడాది 173.70 రూపాయలు కిలోకు టీ ధర ఉంది. ఇది 2019 లో కిలోకు 119.23 రూపాయలుగా ఉండేది. ఇక ప్రస్తుతం కోల్‌కతాలో కిలో టీ ధర 240.87 రూపాయలకు చేరుకుంది. 2020 లో దీని ధర కిలోకు 184.33 రూపాయలు మాత్రమే. అదే 2019 లో కిలోకు 149.83 రూపాయలుగా ఉంది. లాక్డౌన్ కారణంగా గతేడాది ఉత్పత్తి తగ్గిందని అస్సాం కంపెనీ సీఈఓ విజయ్ సింగ్ తెలిపారు. ఈ ఏడాది మొదటి భాగంలో కరువు కారణంగా పంట నాశనమైందన్నారు. పెరిగిన ఉత్పత్తి ఖర్చులు మరియు తక్కువ దిగుబడి కారణంగా ధరలు పెరిగాయి. అయితే, టీ ఆకుల ధరలు వచ్చే నెల నుంచి తగ్గవచ్చు. వర్షాలలో మంచి నాణ్యమైన టీ రావడంతో ధరలు తగ్గడం ప్రారంభమవుతుందని గౌహతికి చెందిన టీ వ్యాపారి సౌరభ్ ట్రీ ట్రేడర్స్ ఎంఎల్ మహేశ్వరి చెప్పారు.

ఎగుమతులపై ప్రభావం..

ఉత్తర భారత టీ ఎగుమతులు 2021 మొదటి త్రైమాసికంలో 27.3 మిలియన్ కేజీలకు తగ్గింది. ఇది 2019 మొదటి త్రైమాసికంలో 396 మిలియన్ కిలోలు. భారతీయ రకంతో పోలిస్తే కెన్యా సిటిసి టీ ధరలు తక్కువ. అటువంటి పరిస్థితిలో, విదేశాల డిమాండ్ ఆఫ్రికా దేశానికి మారుతోంది. జిటిఐసి కోర్ కమిటీ సభ్యుడు దినేష్ బిహాని మాట్లాడుతూ జూన్ రెండవ వారంలో ప్రీమియం హల్మారి టీ జిటిఎసి వద్ద కిలోకు 621 రూపాయలకు అమ్ముడైందని చెప్పారు. మంచి నాణ్యమైన టీకి బలమైన డిమాండ్ ఉందని ఇది సూచిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read: Income Tax: గృహిణి ఆదా చేసిన మొత్తాన్ని ఆదాయంగా పరిగణించడం సరికాదు..ఐటీఏటీ తీర్పు

JioPhone Next: గూగుల్ తో కలిసి ప్రపంచంలోనే చౌకైన స్మార్ట్ ఫోన్ ‘జియోఫోన్ నెక్స్ట్‌’ను ప్రకటించిన రిలయన్స్