బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వీరి కోసం సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చిన ఎస్బీఐ.. ఎలా పని చేస్తుందంటే..

|

Aug 03, 2021 | 8:12 AM

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ వినియోగదారుల ఖాతా భద్రత కోసం సరికొత్త ఫీచర్

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వీరి కోసం సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చిన ఎస్బీఐ.. ఎలా పని చేస్తుందంటే..
Sbi
Follow us on

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ వినియోగదారుల ఖాతా భద్రత కోసం సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. కస్టమర్ల భద్రత కోసం ఎస్బీఐ తన యోనో, యోనో లైట్ యాప్‏లో కొత్తగా భద్రతా ఫీచర్ సిమ్ బైండింగ్ ను ప్రారంభించింది. ఈ ఫీచర్… వినియోగదారులను డిజిటల్ మోసాల నుంచి కాపాడుతుంది. సిమ్ బైండింగ్ ఫీచర్ యోనో, యోనో లైట్ బ్యాంకు యాప్‏లో మీ మొబైల్ నంబర్ రిజిస్టర్ అయి ఉండాలి.

ఎస్బీఐ డీఎండీ, చీఫ్ డిజిటల్ ఆఫీసర్ రాణా అశుతోష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఎస్బీఐ బైండింగ్ సదుపాయాన్ని యోనో, యోనో లైట్ యాప్స్ లలో ప్రవేశ పెట్టడం సంతోషంగా ఉంది. సరికొత్త సదుపాయాలతో వినయోగదారులకు మెరుగైన భద్రతను కల్పించడతోపాటు.. వారికి అనుకూలంగా.. సురక్షితమైన ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలను అందిచడమే లక్ష్యం. ఎస్బీఐ ఎప్పుడూ తమ కస్టమర్లను ఇంటి నుంచి డిజిటల్ బ్యాంకింగ్ సేలను అందుకునేలా ప్రోత్సహించడానికి, యోనో, యోనో లైట్ నుంచి ఓకే స్టాప్ బ్యాంకింగ్ పరిష్కారాలను పొందడానికి ప్రయత్నిస్తామన్నారు. ఈ ఫ్లాట్ ఫామ్స్ కొత్త వెర్షన్ వినియోగదారులను డిజిటల్ మోసాల నుంచి రక్షిస్తుంది. ఎఐఎం బైండింగ్ ఫీచర్ తో యోనో, యోనో లైట్ బ్యాంక్ లో మొబైల్ నంబర్లు రిజిస్టర్ చేసుకున్న ఫోన్లలలో మాత్రమే పనిచేస్తుందని తెలిపారు.

SIM బైండింగ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది..
1. యోనో, యోనో లైట్ యాప్స్ కొత్త వెర్షన్స్ లను ఉపయోగించుకోవడానికి ముందుగా వీటిని అప్ డేట్ చేసుకోవాలి.
2. రిజిస్టర్ చేసుకోవడానికి బ్యాంకు ఖాతా మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి.
3. ఆ తర్వాత కస్టమర్లు.. రిజిస్టర్ కాంటాక్ట్ నంబర్ అయిన సిమ్ తో నమోదు చేసుకున్నట్లుగా నిర్ధారించుకోవాలి.
4. ఈ రెండు యాప్స్.. కస్టమర్ మొబైల్ లో RMN ప్రాథమిక నియమంతో పనిచేస్తాయి. అయితే కస్టమర్లు బ్యాంకుతో RMN సిమ్ ని ఉపయోగించి ఒకే ఫోన్ లో యోనో, యోనో లైట్ రెండింటినీ ఉపయోగించవచ్చు. ఒకవేళ కస్టమర్ బ్యాంకు ఖాతాతో లింక్ చేయని మొబైల్ నంబర్ ఉపయోగించానుకుంటే.. యోనో, యోనో లైట్ రిజిస్టర్ ప్రక్రియ చేయలేరు.
5. కొత్తగా SIM బైండింగ్ ఫీచర్ రెండు వేర్వేరు కస్టమర్లను యోనో, యోనో లైట్ యాప్ లను డ్యూయల్ సిమ్ హ్యాండ్ సెట్‏లో విడివిడిగా ఉపయోగించవచ్చు.

Also Read:

Viral Video: మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మ.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన పీవీ సింధుకు బంపర్ ఆఫర్.. కీలక ప్రకటన చేసిన ఏపీ సర్కార్..