దేశంలో 5జీ సేవలు క్రమంగా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం ఎయిర్‌టెల్, జియోలు 5జీ సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చి ఏడాది గడుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతానికి ఈ రెండు సంస్థలు 5జీ నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లో ఉచితంగానే 5జీ డేటాను అందిస్తోంది. అయితే ఈ ఉచిత సేవలు ఇంకా కొన్ని రోజులే అని తెలుస్తోంది.
5జీ డేటాకు ఛార్జీలను వసూలు చేసేందుకు ఈ రెండు టెలికం కంపెనీలు సిద్ధమవుతున్నట్లు సమచారం. ఈ ఏడాది జులై నెల నుంచి 5జీ సేవలకు ఛార్జీలు వసూలు చేయున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం 5జ సేవలను అందిస్తోన్న ఎయిర్‌టెల్, జియో కంపెనీలు 4జీ ప్రీపెయిడ్ ప్లాన్స్‌పైనే 5జీ సేవలను అందిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఇకపై 5జీ సేవలకు ప్రత్యేక ప్లాన్స్‌ను పరిచయం చేయనున్నారు.
4జీ సేవలతో పోల్చితే 5జీ సేవలు 5 నుంచి 10 శాతం అధికంగా ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఛార్జీల విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎయిర్‌టెల్, జియోలకు కలిపి సుమారు 12 కోట్ల 5జీ వినయోగదారులు ఉన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 20 కోట్లు దాటుతోందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు టెలికం సంస్థలే 5జీ సేవలను అందిస్తున్న నేపథ్యంలో భారీగా ఛార్జీలు వసూలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..