Skoda Cars: అరుదైన అవకాశం.. స్కోడా కార్లపై ఏకంగా రూ. 1.10 లక్షల వరకూ తగ్గింపు.. మిస్ చేసుకోవద్దు..

స్కోడా మన దేశంలోని ఎంట్రీ లెవల్ మోడల్ కార్ల ధరలను తగ్గించింది. స్కోడా కుషక్, స్కోడా స్లేవియా మోడళ్ల దాదాపు రూ. 1.10లక్షల వరకూ తగ్గింపు అందిస్తోంది. వాస్తవానికి స్కోడా కుషక్ ప్రారంభ ధర రూ. 10.89లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది. దీనిపై రూ. 1.10లక్ష తగ్గింపు లభిస్తోంది. అలాగే స్కోడా స్లేవియా కారు ప్రారంభ ధర రూ. 10.69లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది. దీని ధరలో రూ. 94,000 వరకూ తగ్గింపు అందిస్తున్నట్లు స్కోడా ప్రకటించింది.

Skoda Cars: అరుదైన అవకాశం.. స్కోడా కార్లపై ఏకంగా రూ. 1.10 లక్షల వరకూ తగ్గింపు.. మిస్ చేసుకోవద్దు..
Skoda Kushaq
Follow us

|

Updated on: Jun 21, 2024 | 4:19 PM

ప్రీమియం కార్ల బ్రాండ్లలో స్కోడా ఒకటి. దీనికి భారతీయ మార్కెట్లో కూడా మంచి డిమాండే ఉంది. సెడాన్ తరహా నుంచి ఎస్‌యూవీల వరకూ వివిధ రకాల మోడళ్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వీటి ధర మధ్యస్తంగా ఉంటాయి. కాగా ఇప్పుడు స్కోడా మన దేశంలోని ఎంట్రీ లెవల్ మోడల్ కార్ల ధరలను తగ్గించింది. స్కోడా కుషక్, స్కోడా స్లేవియా మోడళ్ల దాదాపు రూ. 1.10లక్షల వరకూ తగ్గింపు అందిస్తోంది. వాస్తవానికి స్కోడా కుషక్ ప్రారంభ ధర రూ. 10.89లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది. దీనిపై రూ. 1.10లక్ష తగ్గింపు లభిస్తోంది. అలాగే స్కోడా స్లేవియా కారు ప్రారంభ ధర రూ. 10.69లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది. దీని ధరలో రూ. 94,000 వరకూ తగ్గింపు అందిస్తున్నట్లు స్కోడా ప్రకటించింది. వినియోగదారులకు మరిన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తున్నట్లు చెబుతున్నారు.

వేరియంట్ల పేర్ల మార్పు..

స్కోడా కుషాక్, స్లేవియా వేరియంట్లో నామకరణంలో కొన్ని మార్పులను చూసింది. మునుపటి యాక్టివ్, యాంబిషన్, స్టైల్ వెర్షన్ల పేర్లను క్లాసిక్, సిగ్నేచర్, ప్రెస్టీజ్ గా మార్చారు. కుషాక్ ఇప్పటికీ మునుపటి మోంటే కార్లో, ఒనిక్స్ ఎడిషన్ ను దాని లైనప్లో ఇతర వేరియంట్లకు సమానమైన ధర మార్పులతో పొందుతోంది.

భద్రతకు భరోసా..

స్కోడా కుషాక్, స్లేవియా భారతదేశంలో ప్రసిద్ధి చెందిన మోడల్ లు, ప్రత్యేకించి వాటి ఫీచర్లలో వినియోగదారులను ఆకర్షిస్తాయి. అంతేకాక పూర్తి భద్రతకు భరోసా నిస్తాయి. గ్లోబల్ ఎన్సీఏపీలో 5-స్టార్ సేఫ్టీ స్కోర్ ను ఈ కార్లు సాధించాయి. ఈ రేటింగ్ తో భారతదేశంలో విక్రయించబడుతున్న సురక్షితమైన కార్లలో ఇవి కూడా ఉన్నాయి.

ఇంజిన్ సామర్థ్యం ఇది..

స్కోడా కుషాక్, స్లేవియా రెండూ 6-స్పీడ్ మాన్యువల్ కు జత చేయబడిన 1.0ఎల్ టర్బో పెట్రోల్ ఇంజిన్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ లేదా 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డీఎస్జీతో జత చేయబడిన 1.5 టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వస్తాయి. 1.0ఎల్ టీఎస్ఐ ఇంజిన్ ఇప్పటికే ఈ20 కంప్లైంట్గా ధ్రువీకృతమైంది. అయితే 1.5ఎల్ టీఎస్ఐ ఇంకా టెస్టింగ్లో ఉంది.

భవిష్యత్ వ్యూహం ఇది..

స్కోడా మన దేశంలో మరింతగా తన మార్కెట్ ను విస్తరించాలని తలపోస్తోంది. అందులో భాగంగానే త్వరలో కొత్త ఎస్ యూవీని తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. స్కోడా ఇండియా 2.0 వ్యూహంలో భాగంగా కొత్త కాంపాక్ట్ ఎస్యూవీని 2025 ప్రారంభంలో మన దేశంలో విడుదల చేయనున్నట్లు స్కోడా ప్రకటించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles