ఆ రోజున వందేభారత్ స్లీపర్.. తొలి రైలు తిరిగేది ఆ రూట్‌లోనే.!

Ravi Kiran

27 June 2024

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు పట్టాలెక్కేసరికి.. ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు తక్కువ సమయంలోనే చేరుకుంటున్నారు. 

వందేభారత్ స్లీపర్‌పై బిగ్ అప్‌డేట్..

అయితే ఇప్పటిదాకా వందేభారత్ రైళ్లు పగటిపూట మాత్రమే తిరుగుతున్నాయి. ఇకపై రాత్రి సమయాల్లోనూ తిరిగేలా వందేభారత్ స్లీపర్ సర్వీసులను ప్రవేశపెట్టనుంది కేంద్ర రైల్వే శాఖ. 

వందేభారత్ స్లీపర్‌పై బిగ్ అప్‌డేట్..

తాజాగా వందేభారత్ స్లీపర్ సర్వీసుల గురించి పెద్ద అప్‌డేట్ వచ్చేసింది. ఆగష్టు 15 నాటికీ తొలి రైలును పట్టాలెక్కిస్తామని రైల్వేశాఖ తెలిపింది.

వందేభారత్ స్లీపర్‌పై బిగ్ అప్‌డేట్..

 వందేభారత్ స్లీపర్ రైలు తయారీ చివరిదశకు చేరుకుందని.. మరో రెండు నెలల్లో పూర్తవుతుందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 

వందేభారత్ స్లీపర్‌పై బిగ్ అప్‌డేట్..

తొలి స్లీపర్ రైలు సర్వీసు ఢిల్లీ నుంచి భోపాల్, సూరత్ మీదుగా ముంబై వెళ్లనుంది. మొత్తం 16 బోగీలతో ఈ రైలు నడవనుంది. 

వందేభారత్ స్లీపర్‌పై బిగ్ అప్‌డేట్..

ఇందులో 10 థర్డ్ క్లాస్ ఏసీలు, 4 సెకండ్ క్లాస్ ఏసీలు, ఒక బోగీ ఫస్ట్ క్లాస్ ఏసీకి కేటాయించారు. అటు సీటింగ్, లగేజి కోసం మరో రెండు బోగీలు అందుబాటులో ఉంటాయి. 

వందేభారత్ స్లీపర్‌పై బిగ్ అప్‌డేట్..

ఈ స్లీపర్ రైళ్లు గంటకు 130 కిలోమీటర్లతో పరుగులు పెడతాయి. క్రమంగా ఈ వేగాన్ని పెంచే అవకాశం ఉందని రైల్వే శాఖ చెప్పింది. 

వందేభారత్ స్లీపర్‌పై బిగ్ అప్‌డేట్..