Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 115, నిఫ్టీ 34 పాయింట్ల డౌన్..

గురువారం స్టాక్ మార్కెట్లు(stock Market) నష్టాల్లో ముగిశాయి. దేశీయ సూచీలు ఇంట్రాడేలో లాభానష్టాల మధ్య ఊగిసలాడాయి...

Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 115, నిఫ్టీ 34 పాయింట్ల డౌన్..
Stock Market

Updated on: Mar 31, 2022 | 4:32 PM

గురువారం స్టాక్ మార్కెట్లు(stock Market) నష్టాల్లో ముగిశాయి. దేశీయ సూచీలు ఇంట్రాడేలో లాభానష్టాల మధ్య ఊగిసలాడాయి. విదేశీ సంస్థాగత మదుపరులు అమ్మకాలకు దిగడంతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీ.. ఒడుదొడుకులు ఎదుర్కొంది. బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్ 115 పాయింట్లు పడిపోయి 58,569 వద్ద ముగిసింది. NSE నిఫ్టీ 34 పాయింట్లు తగ్గి 17,465 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.34 శాతం, స్మాల్ క్యాప్ 0.69 శాతం పడిపోయాయి. నిఫ్టీ ఫార్మా 1.17, నిఫ్టీ హెల్త్‌కేర్ 1.29 శాతం వరకు పడిపోయాయి. హిందాల్కో షేరు 4.75 శాతం తగ్గి రూ. 571.30కి చేరి నిఫ్టీలో టాప్ లూజర్‌గా నిలిచింది.

దివీస్ ల్యాబ్, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా నష్టపోయాయి. 1,500 కంపెనీల షేర్లు పెరగ్గా, 1,881 కంపెనీల షేర్లు పడిపోయాయి. 30 షేర్ల బిఎస్‌ఈ ఇండెక్స్‌లో రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, విప్రో, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్ నష్టపోయాయి. M&M, హిందుస్థాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్ లాభపడ్డాయి.

క్రూడ్‌ ఆయిల్ ధరలు స్పల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 106 డాలర్లు ఉండగా.. డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఆయిల్ బ్యారెల్‌ ధర 101 డాలర్లుగా ఉంది.

Read Also.. Maternity Insurance: తల్లిదండ్రులు కావాలనుకుంటే ముందుగా మెట‌ర్నిటీ హెల్త్ పాల‌సీ తీసుకోండి.. ఎన్ని లాభాలో తెలుసా..

Loading...
Unable to load recommendations.
Follow Us