SBI Credit Card Rule: మీరు ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? మీకో షాకింగ్‌ న్యూస్‌.. మే 1 నుంచి అమల్లోకి..

SBI Credit Card Rule: మే 1, 2026 నుంచి ఎస్‌బీఐ (SBI) క్రెడిట్ కార్డ్ నియమాల్లో కీలక మార్పులు రానున్నాయి. ముఖ్యంగా రెండు అంశాల్లో మార్పులు చేశారు. ఈ నిబంధనలు క్రెడిట్‌ కార్డు వాడేవారికి భారీ దెబ్బ అని చెప్పవచ్చు. మరి ఏయే క్రెడిట్‌ కార్డులో ఎలాంటి నిబంధనలు మారాయో చూద్దాం..

SBI Credit Card Rule: మీరు ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? మీకో షాకింగ్‌ న్యూస్‌.. మే 1 నుంచి అమల్లోకి..
Credit Card

Updated on: May 01, 2026 | 7:45 AM

SBI Credit Card Rule Changes: మే నెల ప్రారంభమైంది. అనేక ప్రధాన ఆర్థిక మార్పులు జరుగనున్నాయి. ఎల్‌పిజి సిలిండర్ ధరల నుండి ఆన్‌లైన్ గేమింగ్ వరకు అన్నింటికీ సంబంధించిన నిబంధనలు మారనున్నాయి. అదే సమయంలో మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ (ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్) ఉపయోగిస్తుంటే, దానికి సంబంధించిన నిబంధనలు కూడా మార్పులు జరుగనున్నాయి. ఎస్‌బిఐ కార్డ్ వెబ్‌సైట్‌లోని అప్‌డేట్‌ చేసిన సమాచారం ప్రకారం, బకాయి చెల్లింపులపై వర్తించే ఛార్జీల పరిమితిని మే 1, 2026 నుండి మారుస్తున్నారు. అదే సమయంలో వార్షిక రుసుము నిబంధనలు కూడా మారనున్నాయి. మీరు SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారు అయితే ఈ మార్పుల గురించి తెలుసుకోవడం ముఖ్యం.

యాన్యువల్ ఫీజు మినహాయింపు (Annual Fee Waiver): ఎస్‌బీఐ బిపిసిఎల్ (SBI BPCL) కార్డ్ హోల్డర్లు ఇకపై రూ.1 లక్ష కంటే ఎక్కువ ఖర్చు చేస్తేనే వార్షిక రుసుము మినహాయింపు లభిస్తుంది (ఇంతకుముందు ఇది రూ.50,000 గా ఉండేది). కార్డు వాడే వారికి ఇది బ్యాడ్‌ న్యూస్‌ అనే చెప్పాలి.

ఇది కూడా చదవండి: Mahatma Gandhi: మహాత్మా గాంధీ టెన్త్ క్లాస్ మార్కులు ఎన్నో తెలుసా? నెట్టింట్లో వైరల్‌ అవుతున్న మార్క్ షీట్

ఇవి కూడా చదవండి

లేట్ పేమెంట్ ఛార్జీలు (Late Payment Charges): గతంలో రూ.500 వరకు బకాయిలపై ఎటువంటి లేట్ ఫీజు ఉండేది కాదు. కానీ ఇప్పుడు రూ.100 దాటితేనే రూ.100 ఛార్జీ విధిస్తారు. అలాగే రూ.500 – రూ.1000 బకాయిలపై ఛార్జీని రూ.400 నుండి రూ.500కి పెంచారు.

గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ కార్డుపై ఉన్న ఫీజు రూ.499. ఇప్పటి వరకు ఇది రూ.50,000 వరకు చేసే ఖర్చులపై వర్తించేది. కానీ ఇప్పుడు ఈ పరిమితిని పెంచుతున్నారు. అంటే, కస్టమర్లు రూ.1 లక్ష కంటే తక్కువ చేసే ఖర్చులపై ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: LPG Price: వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌ ధర..!

ఇది కూడా చదవండి: Gold Price Today: మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us