
మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో ఖాతా ఉందా? అయితే ఈ అప్ డేట్ మీ కోసమే.. ఇప్పటి వరకూ ఆన్ లైన్, మొబైల్ యాప్, ఎస్ఎంఎస్ ల సాయంతో వినియోగదారులకు తమ ఖాతాల సమాచారాన్ని అందించిన ఎస్బీఐ.. ఇప్పుడు వాట్సాప్ సేవలను కూడా ప్రారంభించింది. వాట్సాప్ ద్వారా ఎస్బీఐ అందిస్తున్న సేవలు ఏంటి? అందుకోసం ఖాతాదారులు ఏం చేయాలి వంటి అంశాలను ఇప్పుడు చూద్దాం..
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాంకేతికతంగా ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. తన కస్టమర్ల సౌకర్యం కోసం ఆన్‌లైన్, మొబైల్ ఆధారిత సేవలను నిరంతరాయంగా అందిస్తోంది. అయితే వినియోగదారుల సమస్యలకు మరింత సులభంగా పరిష్కారం చూపేందుకు ఇప్పుడు వాట్సాప్ సేవ కూడా ప్రారంభించింది. ఈ సేవను మీరు వినియోగించుకునేందుకు చేయవలసిదల్లా మీ మొబైల్ ని ఉపయోగించి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడమే.
ప్రస్తుతం ఎస్బీఐ వాట్సాప్ ద్వారా 9 బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. ఆ సేవల వివరాలు ఇప్పుడు చూద్దాం..
1. ఖాతా బ్యాలెన్స్
2. మినీ స్టేట్‌మెంట్
3. పెన్షన్ స్లిప్ సేవ
4. లోన్ లపై సమాచారం.. హోమ్ లోన్, కార్ లోన్, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్, ఎడ్యుకేషనల్ లోన్ వంటి వాటిపై తరచుగా అడిగే ప్రశ్నలు, వడ్డీ రేట్ల వివరాలు
5. డిపాజిట్ లపై సమాచారం.. సేవింగ్స్ ఖాతా, రికరింగ్ డిపాజిట్, టర్మ్ డిపాజిట్ వంటి వాటిలోని ఫీచర్లు, వడ్డీ రేట్ల వివరాలు
6. NRI సేవలు.. NRE ఖాతా, NRO ఖాతాల్లోని ఫీచర్లు, వడ్డీ రేట్ల వివరాలు
7. ఇన్‌స్టా ఖాతాలను తెరవడం.. వాటిలో ఉండే ఫీచర్‌లు/అర్హత, అవసరాలు , తరచుగా అడిగే ప్రశ్నలు
8. కాంటాక్ట్స్/గ్రీవెన్స్ రిడ్రెసల్ హెల్ప్‌లైన్‌లు
9. ముందుగా తీసుకున్న లోన్ లకు సంబంధించిన ప్రశ్నలు.. అంటే వ్యక్తిగత లోన్, కార్ లోన్, టూ వీలర్ లోన్ ప్రస్తుత పరిస్థితి, ఈఎంఐ ల వివరాలు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..