కరోనా ఆటోమొబైల్ మార్కెట్‌ను సంక్షోభంలోకి నెట్టేసింది. ముఖ్యంగా ఉద్యోగ నష్టాలు, జీతాల్లో కోత, కంపెనీల మూత ఇలా ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంతో ఆటో మొబైల్ రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుంది. చాలా మంది కార్ల కొనుగోలుదారులు ఈఎంఐలను చెల్లించకలేక కార్లను అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగయ్యాయి. అయితే ప్రజలు కూడా సేవింగ్స్ మొత్తం ఖర్చు అయ్యిపోవడంతో సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలుకే మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా కార్లల్లో కచ్చితం సెకండ్ హ్యాండ్ కార్లను ఎంచుకుంటున్నారు. ఈ రోజుల్లో వాహనాలకు డిమాండ్ భారీగా ఉంది. కార్లకు క్రేజ్ మరింత పెరిగింది. కరోనా తర్వాత ప్రతి ఒక్కరు కారు కొనుగోలు చేయాలని ఆశపడుతున్నాడు. ఒకప్పుడు డబ్బున్నవాళ్లే కార్లు కొనుగోలు చేసేవారు.
కానీ ఇప్పుడు సామాన్యుడు సైతం కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. అయితే కొత్త కారు కొనుగోలు చేసేందుకు స్థోమత లేని వారు సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఈ రోజుల్లో్ రెండు లక్షలలోపు కూడా సెకండ్ హ్యాండ్ కార్లు లభిస్తున్నాయి. ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ కార్ల ప్లాట్‌ఫామ్ భారీగానే వెలుస్తున్నాయి. తక్కువ ధరల్లో మంచి కార్లు లభిస్తుండటంతో సామాన్యులు సైతం వీటిపై చూస్తున్నారు. అయితే కారు కొనుగోలు చేయాలని భావించే సామాన్యులకు ఓ బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. కార్స్ 24 వెబ్‌సైట్‌లో తక్కువ ధరల్లోనే అద్భుతమైన కార్లు అందుబాటలో ఉన్నాయి.
మీరు కూడా కారు కొనాలని భావిస్తే ఒకసారి ఈ సైట్‌ను సందర్శిస్తే తక్కువ ధరల్లోనే కారు సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం Cars 24వెబ్‌సైట్‌లో Tata Safari 7 సీటర్స్ కారు తక్కువ ధరల్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ కారు ధర రూ.16.19 లక్షల నుంచి రూ.27.34 లక్షల వరకు ఉండగా, అదే కార్స్ 24వెబ్‌సైట్‌లో 2021 మోడల్ టాటా సఫారీ 7 సీటర్ ధర కేవలం రూ.14.18 లక్షలకే అందుబాటులో ఉంది. అంతేకాదండోయ్ ఈ సెకండ్ హ్యాండ్ సైట్లో కారు కొనుగోలు చేయాలంటే ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. డీజిల్ వెర్షన్ కారు ప్రస్తుతం ఈ కారు 61 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉంది. అయితే ఈ కార్స్ 24 సైట్‌లో అన్ని రకాల వాహనాలు తక్కువలో ధరల్లో లభిస్తాయి. బయట మార్కెట్ కంటే తక్కువలో అన్ని రకాల వాహలు ఉన్నాయి. ఎవరైన సెకండ్ హ్యాండ్ వాహనాలు కావాలని భావిస్తే కార్స్24ను చూడవచ్చు.
ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయాలనుకునే వాళ్లు కచ్చితంగా బడ్జెట్‌ను సెట్ చేయాల్సి ఉంటుందని గుర్తించుకోండి. మనం ఏ ధరలో కారను కావాలని కోరుకుంటున్నామో? అదే ధరలో కారును కొనాలి? కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మంచి కారు వస్తుందనే ఉద్దేశంతో చాలా మంది బడ్జెట్‌ను అంచనావ వేయకుండా కారును కొనుగోలు చేస్తారు. అలాంటి సమయంలో అప్పుల పాలు కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా బీమా, ఇంధన బిల్లులు, నిర్వహణ ఖర్చులన్నీ బేరీజు వేసుకుని కారును కొనుగోలు చేయడం ఉత్తమం.
అయితే వాహనదారులు ఈ సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసే ముందు సదరు వాహనానికి సంబంధించిన యజమానిని కలవకుండా, కారు కండీషన్ చెక్ చేయకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వయంగా ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు చేయకండి. ఈ విషయాన్ని కస్టమర్లు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.
source
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి