JIO 5G: జియో యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. 5జీ సేవలు అందుబాటులోకి వచ్చేది అప్పుడే.?

|

Aug 04, 2022 | 4:57 PM

JIO 5G: దేశ ప్రజలంతా 5జీ సేవలు ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. మునుపెన్నడూ లేనంత వేగంగా ఇంటర్‌నెట్‌ సేవలను పొందడానికి ఆసక్తికగా ఉన్నారు. ఇదిలా ఉంటే..

JIO 5G: జియో యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. 5జీ సేవలు అందుబాటులోకి వచ్చేది అప్పుడే.?
Follow us on

JIO 5G: దేశ ప్రజలంతా 5జీ సేవలు ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. మునుపెన్నడూ లేనంత వేగంగా ఇంటర్‌నెట్‌ సేవలను పొందడానికి ఆసక్తికగా ఉన్నారు. ఇదిలా ఉంటే 5జీ సేవలకు సంబంధించి ఇప్పటికే స్పెక్ట్రమ్‌ పూర్తయిన విషయం తెలిసిందే. ఇందులో అత్యధిక బిడ్డర్‌గా జియో నిలిచింది. ఈ కంపెనీ ఏకంగా రూ. 80 వేల కొట్లకుపైగా వెచ్చించి ఎక్కువ ఎయిర్‌ వేవ్స్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే దేశంలో 5జీ సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి రానున్నాయన్నదానిపై ఇంకా ఓ స్పష్టత రాలేదు.

ఎయిర్‌టెల్‌తో పాటు జియో ఇప్పటికే 5జీ ట్రయల్స్‌ను నిర్వహించగా ఎవరు ముందుగా సేవలను అందుబాటులోకి తీసుకొస్తారన్న దానిపై ప్రకటన మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం దేశంలో తొలిసారి జియో సేవలను అందుబాటులోకి తెచ్చేది జియోనే అని తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. తాజాగా జియో కొత్త బాస్‌ ఆకాశ్‌ అంబానీ మాట్లాడుతూ.. ‘దేశవ్యాప్తంగా 5జీ రోల్అవుట్‌తో అజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుక జరుపుకుందాం’ అని వ్యాఖ్యానించారు. దీంతో జియో 5జీ సేవలను ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురానుందన్న వార్తలకు బలం చేకూరుంది. ఇక 5జీ నెట్‌వర్క్‌కు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ జియోకు సిద్ధంగా ఉండడంతో దేశంలో తొలుత సేవలను జియోనే అందుబాటులోకి తీసుకొస్తుందని అంతా భావించారు.

అయితే ఆగస్టు 15కి ఇంకా కేవలం కొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో జియో నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం. దీందో స్వాతంత్ర్య దినోత్సవానికి 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న రియల్స్‌ ప్లాన్‌ వర్కవుట్‌ కాదేమో అన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..