Realme 16 Pro: హ్యారీ పోటర్ అభిమానులకు గుడ్ న్యూస్.. Realme 16 Pro స్పెషల్ ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

Realme 16 Pro: రియల్‌మీ 16 ప్రో హ్యారీ పోటర్ లిమిటెడ్ ఎడిషన్ 12GB+256GB వేరియంట్ ధర రూ. 62,999. లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ. 6,300 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో ఇది రూ. 56,699 ప్రారంభ ధరకే..

Realme 16 Pro: హ్యారీ పోటర్ అభిమానులకు గుడ్ న్యూస్.. Realme 16 Pro స్పెషల్ ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
Realme Mobile

Updated on: Sep 23, 2026 | 8:24 AM

Realme 16 Pro: వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ సహకారంతో రియల్‌మీ భారతదేశంలో కొత్త రియల్‌మీ 16 ప్రో 5G హ్యారీ పోటర్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇది ఇప్పటికే విడుదలైన రియల్‌మీ 16 ప్రో మోడల్‌తో ఆకర్షణీయమైన డిజైన్‌ను, హ్యారీ పోటర్ థీమ్‌ను మిళితం చేసిన ఒక లిమిటెడ్ ఎడిషన్ స్పెషల్ మోడల్. ఈ స్పెషల్ ఎడిషన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో హ్యారీ పోటర్ ఫ్రాంచైజీకి చెందిన అనేక అంశాలు పొందుపర్చారు.

ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ వెనుక ప్యానెల్, ‘విజార్డ్స్ చెస్’ ఆటలోని ‘ఆర్గైల్’ నమూనాతో కూడిన బ్రౌన్ టెక్స్చర్డ్ లెదర్‌తో తయారు చేశారు. ఇందులో రియల్‌మీ “క్వాడ్రా లైట్-సెన్సింగ్ కలర్-ఛేంజింగ్ టెక్” టెక్నాలజీ ఉందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఇది కాంతిని బట్టి రంగును మారుస్తుంది. వెనుక ప్యానెల్ మధ్యలో హాగ్వార్ట్స్ చిహ్నం పొందుపర్చారు. ‘మెటల్ మిర్రర్ కెమెరా డెకో’ శైలిలో ఉన్న మెటాలిక్ కెమెరా మాడ్యూల్, హ్యారీ పోటర్‌లోని ‘హెడ్విగ్’ అనే గుడ్లగూబను గుర్తుచేసే విధంగా రూపొందించారు.

ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ మెటాలిక్ ఫ్రేమ్‌పై “వెల్కమ్ టు హాగ్వార్ట్స్” అనే అక్షరాలు లేజర్‌తో చెక్కబడి ఉంటాయి. ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో లాక్ స్క్రీన్‌లు, యాప్ ఐకాన్ ప్యాక్‌లు, వాల్‌పేపర్‌లు, హ్యారీ పోటర్ ఫ్రాంచైజీకి ప్రత్యేకమైన కెమెరా ఫిల్టర్ ప్రీసెట్‌లతో కూడిన కస్టమ్ UI థీమ్‌లు ఉన్నాయి.

ఈ లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్, హ్యారీ పోటర్ లోని హాగ్వార్ట్స్ స్కూల్ ట్రంక్ నమూనాలో రూపొందించిన ఒక ప్రత్యేక గిఫ్టింగ్ బాక్స్‌లో వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 5,000 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ బాక్స్‌లో, హాగ్వార్ట్స్ అంగీకార పత్రం కాపీ, ఒక ‘ప్లాట్‌ఫామ్ 9¾’ రైలు టిక్కెట్, నాలుగు హాగ్వార్ట్స్ హౌస్‌ల చిహ్నాలతో కూడిన బుక్‌మార్క్‌లు, క్యారెక్టర్ పోస్ట్‌కార్డులు, హాగ్వార్ట్స్ చిహ్నంతో కూడిన ఫోన్ కేస్, ఒక థీమ్డ్ సిమ్ ఎజెక్టర్ టూల్ ఉన్నాయి.

రియల్‌మీ 16 ప్రో హార్డ్‌వేర్ ఫీచర్లు ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో ఉన్నట్లే ఉన్నాయి. ఇందులో 2.5GHz ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 మాక్స్ 4nm ప్రాసెసర్, మాలి G615 MC2 GPU, 12GB LPDDR4X RAM, 256GB (UFS 3.1) స్టోరేజ్, 144Hz 6.8-అంగుళాల OLED డిస్‌ప్లే, AGC DT స్టార్ D+ ప్రొటెక్షన్ ఉన్నాయి.

ఇతర ముఖ్యమైన ఫీచర్లలో 200MP ప్రధాన కెమెరా (1/1.56″ HP5 సెన్సార్, OIS, f/1.8 అపెర్చర్), 8MP అల్ట్రా-వైడ్ కెమెరా (1/4″ OV08D10 సెన్సార్, f/2.2 అపెర్చర్), 4K 30 fps వీడియో, 50MP ఫ్రంట్ కెమెరా (1/2.88″ OV50D40 సెన్సార్), ఇన్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP66/IP68/IP69/IP69K రేటింగ్, డ్యూయల్ సిమ్ (నానో + నానో), 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 7000mAh బ్యాటరీ ఉన్నాయి.

ధర: రియల్‌మీ 16 ప్రో హ్యారీ పోటర్ లిమిటెడ్ ఎడిషన్ 12GB+256GB వేరియంట్ ధర రూ. 62,999. లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ. 6,300 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో ఇది రూ. 56,699 ప్రారంభ ధరకే అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ వెబ్‌సైట్, రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు.. అన్ని బ్యాంకుల బ్యాలెన్స్ ఒకేచోట!

ఇది కూడా చదవండి: Gold Loans: గోల్డ్ లోన్లకు ఎందుకంత క్రేజ్? ఇప్పుడు వాళ్లు కూడా బంగారం తాకట్టు పెడుతున్నారట..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us