
మూడేళ్ల పాటు మీరు అకౌంట్ నుంచి ఎలాంటి లావాదేవీలు చేయకపోయినా లేదా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోయినా మీ బ్యాంక్ అకౌంట్‌ను సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఇనాక్టివ్ చేస్తుంది. కేవైసీ పూర్తి చేసుకోవాలని లేదా బ్యాంక్ అకౌంట్ నుంచి ఏదొక లావాదేవీ చేయకపోతే అకౌంట్ ఇనాక్టివ్ అవుతుందని బ్యాంకులు మెస్సేజ్‌ల రూపంలో ముందుగానే హెచ్చరిస్తుంటాయి. మీరు వెంటనే చర్య తీసుకోకపోతే అకౌంట్ ఇనాక్టివ్‌గా పరిగణిస్తారు. ఈ అకౌంట్ నుంచి మీరు ఎలాంటి లావాదేవీలు చేయలేరు. మళ్లీ బ్యాంక్‌కు వెళ్లి అవసరమైన పత్రాలను సమర్పించి కేవైసీ పూర్తి చేసుకుంటే యాక్టివ్ అవుతుంది. అయితే మీరు పదేళ్ల పాటు అకౌంట్‌ను వాడకుండా అలాగే వదిలేస్తే మీ అకౌంట్లోని సొమ్ము ఆర్బీఐ ప్రత్యేక ఫండ్‌లోకి వెళ్తుంది. ఇలాంటి సమయంలో మీరు తిరిగి వడ్డీతో సహా వాటిని తీసుకోవచ్చు. అలాంటి పాత బ్యాంక్ అకౌంట్లను గుర్తించే వ్యవస్థను ఆర్బీఐ తీసుకొచ్చింది.
ఖాతాదారులు తమ పాత బ్యాంక్ అకౌంట్లను సులువుగా గుర్తించేందుకు వీలుగా UDGAM పోర్టల్ ఆర్బీఐ ప్రవేశపెట్టింది. పాత ఖాతాలను గుర్తించడంతో పాటు బ్యాంకుల్లో 10 సంవత్సరాలకుపైగా ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలను సులువుగా ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. బ్యాంక్‌కు వెళ్లి ఆధార్, పాన్ లాంటి ధృవీకరణ పత్రాలను సమర్పించి తిరిగి మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ చేసుకోవడంతో పాటు అందులోని సొమ్మును విత్ డ్రా చేసుకోవచ్చు. UDGAM వెబ్‌సైట్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, బ్యాంక్ పేరు, పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా మీ పాత బ్యాంక్ అకౌంట్ వివరాలు పొందవచ్చు. పాత బ్యాంక్ అకౌంట్లలోని సొమ్మును ఖాతాదారులు తిరిగి పొందేలా సహాయపడేందుకు ఆర్బీఐ ఈ కొత్త పోర్టల్ తీసుకొచ్చింది.
-https://udgam.rbi.org.in వెబ్‌సైట్‌ను సందర్శించండి
-మీ మొబైల్ నెంబర్‌తో లాగిన్ చేయండి
– ఖాతాదారుని పేరు, చిరునామా, పుట్టిన తేదీ, పాన్ కార్డు వివరాలను నమోదు చేయండి
-మీ బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి అవసరమైన KYC పత్రాలను సమర్పించండి
-అందులోని మీ డబ్బులను వడ్డీతో సహా తీసుకోండి
-మరణించిన వ్యక్తి ఖాతాలోని సొమ్మును నామినీ తీసుకోవచ్చు. ఇందుకు మరణించిన వ్యక్తి డెట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, నామినీ ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది.
-మీ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లండి
-ఆధార్, పాన్ అందించండి
-మీ అకౌంట్‌ను యాక్టివ్ చేయమని అడగండి
-విత్ డ్రా ఫారం నింపి మీ డబ్బులు విత్ డ్రా చేసుకోండి