
Indian Coins: కరెన్సీపై సోషల్ మీడియాలో అనేక ఫుకార్లు షికార్ చేస్తూ ఉంటాయి. అది చెల్లదు.. ఇది చెల్లదు అంటూ ఫేక్ ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రచారాలను నమ్మి కొంతమంది వ్యాపారులు కరెన్సీని స్వీకరించరు. గతంలో కరెన్సీపై ఇలాంటి అపోహాలు చాలానే రాగా.. వీటి గురించి ఆర్బీఐ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా మరో ప్రచారంపై కూడా ఆర్‌బీఐ స్పందించింది. నాణేలపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఒక వీడియో కూడా విడుదల చేసింది. ఇంతకు ఆర్బీఐ ఇచ్చిన క్లారిటీ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.
తాజాగా వాట్సప్ ద్వారా ప్రజలందరికీ నాణేలపై అపోహలు తొలగిస్తూ ఆర్బీఐ ఒక మెస్సేజ్ పంపింది. వేర్వేరు డిజైన్లు గల నాణేలు చెల్లుతాయని, ఒకే విలువ కలిగిన వేర్వేరు డిజైన్లు గల నాణేలు ఒకే సమయంలో చెలామణిలోనే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇక 50 పైసలు, రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 నాణేలు అన్నీ చట్టబద్ధమైనవి, అవన్నీ సుదీర్ఘకాలం చెలామణిలో ఉంటాయని తెలిపింది. నాణేల గురించి తప్పుదారి పట్టించే సమాచారాన్ని లేదా పుకార్లను నమ్మవద్దందంది. ఎటువంటి సందేహం లేకుండా వాటిని స్వీకరించాలని, ఈ విషయాలు అన్నీ తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలని ఆర్‌బీఐ తన ప్రకటనలో తెలిపింది. వ్యాపారులు కూడా వీటిని స్వీకరించాలని సూచించింది.
🪙 వేర్వేరు డిజైన్లు గల నాణేల పట్ల నమ్మకం లేకుండా ఉన్నారా?
🔸50 పైసలు, ₹1, ₹2, ₹5, ₹10, ₹20 నాణేలు అన్నీ చట్టబద్ధమైనవి, సుదీర్ఘకాలం చెలామణిలో ఉంటాయి.
🔸ఎటువంటి సందేహం లేకుండా వాటిని స్వీకరించండి.
🔸ఆర్బిఐ అంటుంది – విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.#RBI @RBI pic.twitter.com/bqtvJZO4DV
— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) December 8, 2025
రూ.10 నాణేలు చెల్లవంటూ గతంలో ప్రచారం జరగ్గా.. కొంతమంది వ్యాపారులు కస్టమర్ల నుంచి తీసుకోలేదు. దీంతో అవి చెల్లుతాయని ఆర్‌బీఐ క్లారిటీ ఇచ్చినా.. ఇప్పటికీ కొంతమంది వ్యాపారులు స్వీకరించడం లేదు. ఇక పాత 50 పైసల నాణేలను కూడా తీసుకోవడం లేదు. అయితే 50 పైసల కాయిన్ కూడా చెల్లుతుందని, అవి ఏ డిజైన్‌లో ఉన్నా తీసుకోవాల్సిందేనని ఆర్‌బీఐ తాజాగా సూచించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి