Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్.. అకౌంట్లోకి ఒకేసారి రూ.50 వేలు.. జస్ట్ నిమిషాల్లోనే..

Updated on: Mar 23, 2026 | 6:29 PM

ఆధార్ కార్డు ఉన్నవారికి కేంద్రం మంచి అవకాశం కల్పిస్తోంది. వీరికి రూ.50 వేల లోన్ అందిస్తోంది. బ్యాంక్ ద్వారా ఇవి నేరుగా అకౌంట్లో జమ అవుతాయి. దరఖాస్త ప్రక్రియ కూడా చాలా సులభతరంగా ఉంటుంది. 12 వాయిదాల్లో దీనిని తిరిగి కట్టవచ్చు.

1 / 5
మీకు ఆధార్ కార్డు ఉందా..? అయితే రూ.50 వేల రుణం కేంద్ర ప్రభుత్వం నుంచి పొందవచ్చు. దీనికి ఎలాంటి హామీ కూడా అవసరం లేదు. ఆధార్ కార్డుతో ఈ రుణం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ కూడా చాలా సులభతరంగా ఉంటుంది.

2 / 5
చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2020లో పీఎం స్వనిధి యోజన పథకాన్ని తీసుకొచ్చిది. కరోనా టైమ్‌లో చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు ఈ స్కీమ్ ప్రవేశపెట్టగా.. ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ పథకం ద్వారా రూ.50 వేల లోన్ మంజూరు చేస్తారు. కేవలం ఆధార్ ఉంటే సరిపోతుంది.

3 / 5
ప్రారంభంలో రూ.10 వేల రుణం అందిస్తారు. దీనిని సకాలంలో తిరిగి చెల్లిస్తే రూ.20 వేలు, మళ్లీ టైమ్‌కి చెల్లిస్తే రూ.50 వేలు అందిస్తారు. ప్రభుత్వ బ్యాంకులో ఈ పథకం కింద లోన్ పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలి. దీనిని 12 నెలల్లో ఈఎంఐల రూపంలో తిరిగి కట్టాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వెబ్ సైట్ ద్వారా కూడా సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

4 / 5
ఆన్‌లైన్‌లో పీఎం స్వనిధి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది కోసం రుణ దరఖాస్తు ఫారం నింపాలి. ఇక అవసరమైన పత్రాలను ముందుగానే సిద్దం చేసి పెట్టుకోవాలి. ఇక ఈకేవైసీ, ఓటీపీ కోసం ఆధార్‌తో మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఇక పట్టణంలో స్థానిక సంస్థల నుంచి సిఫార్సు లేఖ అందించాల్సి ఉంటుంది.

5 / 5
ఇక మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కి వెళ్లి కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు. రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి కనీసం 21 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఇక రుణదాతను బట్టి గరిష్ట వయస్సు మారవచ్చు. ఇక కనీస ఆదాయం రూ.25 వేలు ఉండాలి.  ఇది కూడా నిబంధనల ప్రకారం మారవచ్చు. ఇక ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఈ లోన్లకు వడ్డీ రేట్లు ఉంటాయి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ప్రస్తుత రేట్ల ప్రకారం ఉంటాయి. ఇక ఎన్‌ఎఫ్‌బీసీల వడ్డీ రేట్లు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఉంటాయి.

Follow Us